బల్లిపాటు (తల)
సాధారణంగా శరీరంపై ఏ ప్రదేశంలో బల్లిపడినా మనసంతా ఆందోళనతో నిండిపోతుంటుంది. ''ఫలానా చోట బల్లి పడింది ... ఏవైనా అవుతుందా ?'' అని తెలిసిన వారిని ఆదుర్దాగా అడగడం జరుగుతూ వుంటుంది. దీనికంతటికి కారణం ... బల్లి పడితే దోషం ఉంటుందనే విషయాలను పెద్దవాళ్ల నుంచి వింటూ వస్తుండటమే! నిజానికి 'బల్లి'కుట్టడం ... కరవడం వంటివి చేయదు కాబట్టే వాటిని మనం ఇంట్లో తిరగనిస్తుంటాం.
ఇక బల్లి మీద పడటం వలన భయపడే వారి కన్నా చిరాకుపడే వారే ఎక్కువగా వుంటారు. బల్లిపాటు వలన దోషాలు కలుగుతాయని తెలిసినా వాటిని చంపడానికి ఎవరూ ప్రయత్నించరు. అందుకు కారణం ఇంట్లోకి వచ్చే కొన్ని రకాల కీటకాలను అది ఆహారంగా స్వీకరిస్తుంటుంది. అంతే కాకుండా బల్లిని చంపడం మహా పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన వాటికి హాని తల పెట్టకుండా ... వాటి కారణంగా కలిగే దోషాలకు నివారణ మార్గాలను కనుక్కోవడానికే ప్రయత్నిస్తుంటారు.
ఇక ఇటీవల కాలంలో చాలా మంది ''బల్లి ఎక్కడపడినా ఏమీకాదు ... తినే వాటిల్లో పడకుండా వుంటే చాలు'' అని జోక్ చేయడం కూడా చూస్తూనే వున్నాం. ఈ నేపథ్యంలో బల్లిపాటు వలన దోషాలు కలుగుతాయనే విషయాన్ని చాలామంది కొట్టి పారేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి నమ్మకం వారిదే అయినప్పటికీ, పూర్వీకులు గ్రంధస్తం చేసి తరువాత తరాల వారికి అందించిన 'బల్లిపాటు శాస్త్రం' లోని వివరాలను ... విశేషాలను తెలుసుకోవడంలో తప్పులేదు. అలా ఈ బల్లిపాటు శాస్త్రంలోకి ఓసారి తొంగిచూస్తే, ఈ విషయాలు మీ దృష్టికి వస్తాయి.
తలపై 'బ్రహ్మ రంధ్రం' వెనుక భాగంలో బల్లి పడితే ఆకస్మిక ధన లాభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇక నేరుగా 'బ్రహ్మరంధ్రం'పై బల్లి పడితే అకాలమరణం సంభవిస్తుంది. 'తల మధ్య భాగంలో' పడటం వలన వ్యాధుల బారినపడే అవకాశముంది. 'తల వెనుక కుడి భాగంలో' పడితే తోడబుట్టిన వారిలో తమకంటే పెద్దవారికి హాని జరుగుతుంది. 'తల వెనుక ఎడమ భాగంలో' పడితే తోడబుట్టిన వారిలో తమ కంటే చిన్నవారికి ప్రాణాపాయం వుంటుంది. 'తలపై పాపిడి తీసుకునే భాగంలో' పడినా పై ఫలితాలే కనిపిస్తాయి. ఇక తలపై ఏ స్థానంలో బల్లి పడినా మేనమామకు కీడు తప్పదని శాస్త్రం చెబుతోంది. 'తల వెంట్రుకల చివరన ... ముంగురులపై బల్లి పడినట్టయితే స్త్రీకి ఆపదలు కలుగుతాయి. ఒకవేళ ఆమె జడపైన పడినట్టయితే అది భర్తకు ప్రాణహాని సూచిస్తుంది.