ఫలితాన్ని చెప్పే కొబ్బరికాయ
దైవకార్యాలకి సంబంధించిన విషయాల్లోనూ ... వివిధ శుభకార్యాలలోను కొబ్బరికాయ ప్రధాన పాత్రను పోషిస్తూ వుంటుంది. కొబ్బరికాయ అభిషేకానికి ... కలశానికి ... నైవేద్యానికి కూడా ఉపయోగిస్తూ వుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన కొబ్బరికాయ లేకుండా ఎవరూ కూడా ఆలయాలకి వెళ్లరు. దేవాలయానికి వెళ్లి అర్చన చేయించాలంటే, ఆ జాబితాలో ముందుగా కొబ్బరికాయే కనిపిస్తుంది.
కొన్ని ఆలయాల్లో కొబ్బరికాయను పూజారి కొట్టడం జరుగుతుంటుంది. మరికొన్ని ఆలయాల్లో భక్తులే కొబ్బరికాయ కొట్టి స్వామికి అంజేస్తుంటారు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా ... చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు.
ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానావంకరలుగా పగులుతుంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది. ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది. ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు.
కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ ... కోడలుగాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్నినింపుకుని, పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు.