పండుగ రోజున సర్పదర్శనం
నాగుపామును దేవతగా భావించి ఆరాధించడమనేది ప్రాచీన కాలం నుంచి వుంది. ఈ కారణంగానే చాలామంది నాగుపామును కొట్టడం ... కొట్టించడం అపరాథంగా భావిస్తారు. నాగుపామును గాయపరచడం వలన వెంటనే శాపం తగులుతుందనీ, ఆ దోషం తరతరాలు వెంటాడుతుందని అంటారు. ఇక తెలిసో .. తెలియకో తమ వలన నాగజాతికి ఏదైనా అపరాథం జరిగి వుంటే ఆ దోషం తొలగిపోవడం కోసమే, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అభిషేకం వంటివి చేయిస్తుంటారు.
నాగదేవత ప్రత్యక్షంగా కొలువైన క్షేత్రాల్లోను ... సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంలో కొలువైన క్షేత్రాల్లోను నిజంగా నాగుపాము కనిపిస్తే భక్తులు ఆనందాశ్చర్యలకు లోనవుతారు. ఆ క్షేత్రం మహాత్మ్యం కారణంగానే నాగదేవత ప్రత్యక్ష దర్శనం లభించిందని అనుకుంటారు. బెంగుళూర్ సమీపంలో గల 'ముక్తినాగ' క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు ఇలాంటి అనుభూతి కలుగుతూ వుంటుంది. ఇక్కడి నాగదేవత ఎన్నో మహిమలను చూపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు.
సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలను నిర్వహిస్తూ వుంటారు. ప్రతియేటా ఈ రోజున ఈ ఆలయంలోకి సర్పం ఒకటి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లిపోతుందట. ఎంతో తేజస్సును కలిగి వుండే ఆ పాము చిత్రాలను కూడా ఇక్కడి వారి దగ్గర చూడవచ్చు. సాధారణంగా ఏ మాత్రం అలికిడి అయినా అక్కడి నుంచి వేగంగా పాములు వెళ్లిపోతుంటాయి.
అలాంటిది ఎంతమంది భక్తులు వున్నా నాగుపాము అక్కడికి తాపీగా రావడం ... అంతే తాపీగా అక్కడి నుంచి వెళ్లి పోవడం చూపరులను ఆశ్చర్య చకితులను చేస్తుంటుంది. మహిమాన్వితమైన ఈ సంఘటన గురించి భక్తులు విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడ నాగదేవత ప్రత్యక్షంగా కొలువై వుందని తలచి మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు.