నామజపమే అసలైన ఆయుధం
భగవంతుడి మనసు గెలుచుకోవడానికి ... ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా ఒక్కో యుగంలో ఒక్కో విధానాన్ని అనుసరించడం జరిగింది. కృతయుగంలో తపస్సు .. త్రేతాయుగంలో యజ్ఞాలు .. ద్వాపర యుగంలో దానాలు దైవాన్ని చేరుకోవడానికి మార్గాలుగా చెప్పబడ్డాయి. ఇక కలియుగానికి వచ్చే సరికి ఈ యుగం లక్షణాలను ... మానవ జీవిత విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 'నామస్మరణ' మాత్రమే చెప్పబడింది.
ఈ యుగంలో దైవానుగ్రహం కోసం సంవత్సరాలపాటు తపస్సు చేయ వలసిన అవసరం లేదు. అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి యజ్ఞయాగాదులు నిర్వహించవలసిన పనిలేదు. తాహతుకి మించి దానధర్మాలు చేయనక్కరలేదు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ... కుటుంబం యొక్క బాధ్యతలను నిర్వహిస్తూనే దైవ నామాన్ని స్మరిస్తూ ఆయన కరుణా కటాక్షాలను పొందవచ్చు. పురాణాలు ... ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
కలియుగంలో భగవంతుడి నామస్మరణం వలన ఆయన అనుగ్రహాన్ని పొందిన భక్తులు ఎందరో వున్నారు. అలాంటి వారిలో కబీరు ... రామదాసు ... పురందరదాసు ముందువరుసలో కనిపిస్తారు. భగవంతుడి నామస్మరణం ఆయన తత్త్వాన్ని అర్థం చేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక సోపానాలను అధిరోహిస్తూ మోక్షాన్ని పొందే అవకాశాన్ని కలిగిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ తమ దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ వుండాలి.
భగవంతుడి నామస్మరణమే అన్ని రకాల కష్టాల నుంచి ... ఆపదల నుంచి కాపాడుతూ ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. తమ ముందున్న అజ్ఞానమనే అంధకారాన్ని చీల్చి, విజయవంతంగా తమని ముందుకు నడిపించే ఆయుధం నామస్మరణమేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.