గండాలు తొలగించే గంగమ్మ
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ధరించిన అనేక రూపాలుగా గ్రామదేవతలు దర్శనమిస్తూ వుంటారు. గ్రామదేవత కారణంగానే గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో వుంటారనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. ఈ కారణంగానే గ్రామదేవతకి సంబంధించిన ఏ విషయంలోనూ ఎలాంటి లోటు జరగకుండా గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. పసుపుతో అలంకరిస్తూ .. కుంకుమతో పూజిస్తూ ... చీరసారెలతో పాటు బోనాలు సమర్పిస్తూ వుంటారు.
అలా అమ్మవారు 'గంగమ్మ తల్లి' పేరుతో పూజలందుకునే ఆలయం మనకి బెంగళూర్ లోని 'మల్లేశ్వరం'లో దర్శనమిస్తూ వుంటుంది. తొలినాళ్లలో అమ్మవారికి ఒక చెట్టుకింద చిన్న మందిరం మాత్రమే వుండేది. ఎవరు కోరిన వరాలను వారికి అమ్మవారు ప్రసాదిస్తూ రావడంతో, ఈ గ్రామంలోని వారందరికీ సంతోషకరమైన ... సంతృప్తికరమైన జీవితం లభించింది. అమ్మవారి పట్ల కృతజ్ఞతతో భక్తులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి గంగమ్మ తల్లికి విశాలమైన ఆలయం నిర్మించారు.
ఆశ్చర్య చకితులను చేసే నగిషీలతో ... అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో అమ్మవారు విశాలనేత్రాలతో ... ముచ్చటైన ముక్కెరతో సౌందర్యాత్మకంగా దర్శనమిస్తూ వుంటుంది. మంగళ .. శుక్ర ... ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు. ఇదే ప్రాంగణంలో కొలువైన వినాయకుడు ... కుమార స్వామి కూడా భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తారు.
ఇక్కడి అమ్మవారు తనని నమ్ముకున్న వారిని గండాల నుంచి గట్టెక్కిస్తుందని భక్తులు ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అందుకు నిదర్శనంగా తమ అనుభవాలను ఆవిష్కరిస్తూ వుంటారు. అడిగినంతనే అమ్మవారు సంతాన సౌభాగ్యాలను ... సిరి సంపదలను ప్రసాదిస్తుందని చెబుతుంటారు. ఆ తల్లి దయ వల్లనే తమ జీవితాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతున్నాయని అంటారు