ఉయ్యాలలూగే మంటపం !
ప్రాచీన క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి నిర్మాణాలు ... శిల్పకళా సంపద మంత్ర ముగ్ధులను చేస్తుంటాయి. ఆలయ ప్రాకారాలు ... గాలిగోపురం ... ప్రాకార మంటపాలు ... కోనేటి మెట్లు ఇలా ప్రతిదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసి వస్తుంది. ఇక కొన్ని నిర్మాణాలు అక్కడ ఉన్నంతసేపు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా ఆలోచింపచేస్తాయి.
అలాంటి నిర్మాణం ఒకటి 'కుమారారామం' లో కనిపిస్తుంది. తారకాసురుడిని సంహరించే సమయంలో ఇక్కడ పడిన శివలింగ భాగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి కుమారారామం అనే పేరు వచ్చింది. పంచారామాలలో ఇది ఒకటిగా అలరారుతోంది. ఈ క్షేత్రంలో ఆలయానికి సంబంధించిన మొదటి ప్రాకారం దాటుకుని లోపలికి వెళితే, అక్కడ 'ఉయ్యాల మంటపం' కనిపిస్తుంది.
భారీ స్తంభాలతో ... విశాలమైన పై కప్పుతో ఈ మంటపం దర్శనమిస్తుంది. ఈ మంటపాన్ని ఒకసారి కదిలించి చూస్తే, అది ఉయ్యాల మాదిరిగా ముందుకి వెనక్కి కదులుతుంది. అయితే ఈ మంటపం ప్రాచీనకాలానికి చెందినది కావడం వలన, శిధిలావస్థకు చేరుకొని ఇలా ఊగుతూ ఉందనుకుంటే పొరపాటే. నిజానికి ఈ మంటపం తన పటిష్టతను ఏ మాత్రం కోల్పోకుండా ఇప్పటికీ ధృడంగా కనిపిస్తూ వుంటుంది.
మరి రాతి మంటపం ఎలా ఊగుతోంది? వచ్చిన వాళ్లంతా దానిని పట్టుకుని ఊపితే అది ఎందుకు పడిపోవడం లేదు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతుంటాయి. అందుకు కారణం ఆనాటి నిర్మాణ నైపుణ్యమని కొందరు, భగవంతుడి లీల అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి మంటపాల్లో దైవానికి ఊయల సేవ జరుగుతూ వుంటుంది. మంటపంలో ఊయల ఊగితే ఆధ్యాత్మిక పరమైన ఆనందం కలుగుతుంది. మంటపమే ఊయలలా ఊగితే ఆనందంతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. అలాంటి అనుభూతినిచ్చే మహిమాన్వితమైన ఈ మంటపాన్ని దర్శించి తీరాలి.