తరిమికొట్టిన హనుమంతుడు
పోతన భాగవతం పూర్తి చేసే పనిలో నిమగ్నమై వుంటాడు. ఆయన దానిని తనకి అంకితం ఇవ్వడానికి ఇష్టపడటంలేదని తెలుసుకున్న సింగభూపాలుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. భాగవత రచన పూర్తి కాగానే తన అంతఃపురానికే చేరుకోవాలని పంతం పడతాడు. భాగవతాన్ని బలవంతంగా తీసుకురావడానికి వెళ్లిన కొందరు రాజభటులు ఓ ఆకారం తమని తరిమికొట్టిందంటూ తిరిగివస్తారు.
దాంతో మరికొందరు రాజభటులను పోతన ఇంటికి పంపిస్తాడు రాజు. చీకటిపడుతోన్న సమయానికి రాజభటులు పోతన ఇంటి సమీపానికి చేరుకుంటారు. పోతనని బెదిరించైనా సరే భాగవత గ్రంధాన్ని తమతో తీసుకు వెళ్లాలనీ, లేదంటే రాజుగారి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని వాళ్లంతా నిర్ణయించుకుంటారు. అలా అంతా కూడబలుక్కుని అడుగు ముందుకువేసేసరికి, పోతన వీధి గుమ్మం దగ్గర ఓ కోతి అటూ ఇటూ పచార్లు చేస్తూ కనిపిస్తుంది.
కోతే కదా అనుకుని అంతా కలిసి ఇంకాస్త ముందుకి వెళతారు. దాంతో ఆ కోతి కోపంగా వారివైపు దూసుకు వచ్చి భయపెడుతుంది. దగ్గరున్న కర్రలతో వాళ్లు దానిని తరమడానికి ప్రయత్నిస్తారు. అంతే ఆ కోతి కొండంతగా పెరిగిపోయి హనుమంతుడిగా మారిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసిన రాజభటులు ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా హనుమంతుడు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడతాడు. ఆయన గదతో మోదుతోన్న దెబ్బలకు తట్టుకోలేక రాజభటులు పరుగులు తీస్తారు. అలా రామభక్తుడైన పోతనను ... ఆయన భాగవత రచనకు హనుమంతుడు రక్షణగా నిలిచాడు.