పేరు చెప్పకూడదా?
భగవంతుడి సృష్టిలో ... మానవుడి దృష్టిలో పడిన ప్రతి జీవికి ఓ పేరు వుంటుంది. అలాగే పర్వతాలకు ... ప్రాంతాలకు ... ప్రదేశాలకు కూడా పేరు పెడుతూ వుంటారు. పేరు అనేది ఓ గుర్తింపునిస్తుంటుంది ... ఉనికిని తెలియజేస్తూ వుంటుంది. గుంపుగా వెడుతుంటే ఓ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు గల వాళ్లు మాత్రమే వెనక్కి తిరిగి చూస్తారు. అలాగని పేరు అనేది కేవలం పిలవడానికి ... పలకడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే.
ప్రతి వ్యక్తి పేరు వెనుక కుటుంబ నేపథ్యం ... వంశ చరిత్ర దాగి వుంటాయి. తల్లిదండ్రులు ... కుటుంబ పెద్దలు పెట్టిన పేరును ఎవరూ కూడా బాగాలేదనుకోరు ... ఆ పేరును మార్చుకోవడానికి ప్రయత్నించరు. ప్రతి ఒక్కరూ తమ పేరు చాలా బాగుందనే అనుకుంటారు ... సమయం వచ్చినప్పుడు తమ పేరు కాస్త ప్రత్యేకమైనదనే ఉద్దేశాన్ని ధ్వనింపజేస్తూ గొప్పగా పలుకుతుంటారు.
అయితే శాస్త్రం మాత్రం ఎక్కడ పడితే అక్కడ తన పేరును చెప్పకూడదని అంటోంది. ఈ కారణంగానే కొందరిని పేరు అడిగినప్పుడు తమ పేరు చెప్పి చివరన ''అంటారు'' అని సమాధానమిస్తుంటారు. తప్పనిసరి అయినప్పుడు అలా చెప్పడమే సరైన పద్ధతి. ఇక కొంత మంది గతంలో తమకి బాగా తెలిసిన వాళ్లు ఎవరైనా ఎదురుపడితే, వెంటనే భార్యా బిడ్డలను పిలిచి పేర్లతో సహా చెప్పి పరిచయం చేసేస్తుంటారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో భార్య పేరు గాని ... పెద్ద కొడుకు పేరు గాని చెప్పకూడదనే విషయాన్ని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అందువల్లనే శాస్త్ర పరిజ్ఞానం గల వాళ్లు '' మా ఆవిడ'' ... ''మా పెద్దబ్బాయి'' అని పరిచయం చేస్తుంటారు. దేవాలయాల్లోనూ ... ఇతర పూజా కార్యక్రమాల్లోను ... అత్యవసరమైనప్పుడు తప్ప పేరు చెప్పకూడదు. తనపేరు చెప్పడం వలన తన ఆయుష్షు ... భార్య ... పెద్ద కుమారుడి పేరు చెప్పడం వలన వారి ఆయుష్షు క్షీణిస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. భర్తను పేరు పెట్టి భార్య పిలవకూడదని అనడం వెనుక గల కారణం కూడా ఇదే.