సాయి సేవా క్షేత్రం
తన మతం మానవత్వమనీ ... తన కులం సమానత్వమని చాటిచెప్పిన సద్గురువు శిరిడీ సాయిబాబా. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే అడుగడుగునా ఆయన ప్రదర్శించిన మానవత్వమే కనిపిస్తుంది. తోటి వారి ఆకలి తీర్చాలి ... ఆదుకోవాలి ... ఆశ్రయం కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన పడిన ఆరాటం గుర్తుకు వస్తుంది.
మానవత్వాన్ని ఆవిష్కరిస్తూ మహనీయుడుగా ... సమస్త గ్రంధాలలోని సారాంశాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా భోదిస్తూ సద్గురువులా ... మనసు కష్టపెట్టిన వారిని సైతం మన్నిస్తూ దేవుడిగా బాబా అందరి హృదయాలకు చేరువయ్యాడు. ఈ కారణంగానే ఆయన ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి.
అలాంటి వాటిలో ఒకటి ఒంగోలు - లాయర్ పేటలో దర్శనమిస్తుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఆలయంలో సాయి కరుణామృతాన్ని కురిపిస్తూ కూర్చుని చాలాకాలమే అయింది. ఇక్కడ అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు ... భజనలు ... ఉత్సవాలు ఘనంగా జరుపుతుంటారు. ఇక్కడి ఆలయ నిర్వాహకులు సాయి సూచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇందులో భాగంగానే ఆలయం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని అన్నదానం ... అనాథ పిల్లలకి సాయం ... పేద విద్యార్ధినీ విద్యార్ధులకు ఉచితంగా చదువు చెప్పించడం ... పేద రోగులకు ఉచితంగా హోమియోపతి ... అల్లోపతి మందులు పంపిణీ చేయడం వంటి చేస్తున్నారు. ఇక్కడి ఆలయ పద్ధతులను స్పూర్తిగా తీసుకుంటే సాయి ఆలయాలు ... భక్తి భావాలనే కాదు, మానవతా పరిమళాలను వెదజల్లుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.