బంధించబడిన భగవంతుడు !
ఒక రోజున సక్కుబాయి వాళ్ల ఊరికి మాధవస్వామి తన శిష్యులతో కలిసి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న సక్కుబాయి, ఆయన రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మాధవస్వామి తన శిష్యులతో కలిసి అక్కడి నుంచి నేరుగా పండరీపురం వెళ్లనున్నట్టు తెలుసుకుంటుంది. తనని కూడా తీసుకువెళ్లవలసిందిగా కోరుతుంది. పాండురంగస్వామి దివ్యమంగళ రూపాన్ని ... అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆయన ఉత్సవాలను చూడాలని వుందని అంటుంది.
ఆమె భక్తి శ్రద్దల గురించి తెలిసిన మాధవస్వామి అందుకు అంగీకరిస్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సక్కుబాయి అత్త - ఆడపడుచు ఆమెని ఓ గదిలో స్తంభానికి కట్టేస్తారు. భార్యను సమర్ధించలేక ... తల్లిని ఎదిరించలేక విశ్వపతి అక్కడి నుంచి అసహనంగా వెళ్లిపోతాడు. సక్కుబాయి పరిస్థితి శ్రీ కృష్ణుడి మనసును కరిగిస్తుంది.
విశ్వపతి రూపంలో సక్కుబాయి దగ్గరికి శ్రీకృష్ణుడు వస్తాడు. ఆమెని బంధ విముక్తురాలిని చేసి పండరీపురానికి వెళ్లి రమ్మని చెబుతాడు. అత్తని - ఆడపడుచుని తలచుకుని సక్కుబాయి ఆందోళనని వ్యక్తం చేస్తుంది. అన్నీ సర్దుకుంటాయని ఆమెకి ధైర్యం చెప్పి పంపిస్తాడు విశ్వపతి రూపంలో వున్న శ్రీకృష్ణుడు.
భర్త రూపంలో వున్నది సాక్షాత్తు ఆ కృష్ణుడే అనే విషయం తెలియని ఆ అమాయకురాలు అక్కడి నుంచి బయలుదేరుతుంది. సక్కుబాయి అలా వెళ్లగానే ఆమె అత్త- ఆడపడుచులకు సందేహం రాకుండా, సక్కుబాయి రూపంలోకి మారిపోయి తనని తాను బంధించుకుంటాడు కృష్ణుడు. అయితే అందుకు ఆయన బాధపడడు ... భక్తి అనే బంధంతో సక్కుబాయే తనని బంధించిందని అనుకుంటూ ఆనందంతో పొంగిపోతాడు.