రేణుకాదేవి ఆవేదన
ప్రతి రోజు జమదగ్ని మహర్షి పూజకు అవసరమైన అభిషేకజలాన్ని రేణుకాదేవి నదీ తీరం నుంచి తీసుకుని వస్తుంటుంది. తన పాతివ్రత్య మహిమ కారణంగా ఆమె ఏ రోజుకారోజు నదీ తీరాన గల పొడి ఇసుకతో కుండను తయారు చేసుకుని అందులో నీటిని తీసుకుని వస్తుంటుంది. పొడి ఇసుకతో అప్పటికప్పుడు కుండను తయారుచేసి నీటిని పట్టే ఆమె పాతివ్రత్యం గురించి చెప్పుకుని దేవతలు సైతం ఆశ్చర్యపోతుంటారు.
అలాంటి పరిస్థితుల్లో ఓ రోజున ఆమె నదీ తీరానికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తూ రాజ వంశానికి చెందిన యువజంటను చూస్తుంది. ఆటపాటల్లో తేలిపోతున్న ఆ జంటను చూడగానే తన ఆశ్రమ జీవితం పట్ల క్షణకాలం పాటు ఆమెకి నిరాశ కలుగుతుంది. అంతే తలపైన గల ఇసుక కుండ ఒక్కసారిగా విచ్చుకుపోతుంది. నీళ్లన్నీ నేలపాలు కావడంతో, హడావిడిగా తిరిగి నదీతీరానికి వెళుతుంది.
ఇసుకతో కుండను తయారుచేయడానికి ఎంతగా ప్రయత్నించినా అది తయారుకాదు. తన మనసు చెదరడమే అందుకు కారణమని భావించిన రేణుకాదేవి ఉత్తచేతులతోనే ఆశ్రమానికి చేరుకుంటుంది. తనని మన్నించమంటూ జమదగ్ని మహర్షిని ప్రాధేయపడుతుంది. ఆశ్రమ ప్రదేశాన్ని అపవిత్రం చేయవద్దని ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడంతో, ఆమె మనసు మరింత గాయపడుతుంది. భర్త ధోరణి బాధకలిగించడంతో రేణుకాదేవి ఒక నిర్ణయానికి వస్తుంది ... దానిని ఆచరణలో పెట్టడానికి ఆ క్షణమే సిద్ధపడుతుంది.