వెలిమినేడు ఆంజనేయుడు
హనుమంతుడి నామాన్ని ఒక్కసారి స్మరించినా అది ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని ప్రార్ధించడం వలన దుష్టగ్రహ పీడల బారి నుంచి విముక్తి లభించడమే కాకుండా, సంపదలు కలుగుతాయనీ ... సౌభాగ్యం స్థిరమవుతుందని చెబుతుంటారు. ఈ కారణంగానే హనుమంతుడు ఎక్కడ కొలువుదీరితే అక్కడ భక్తుల సందడి కనిపిస్తూనే వుంటుంది.
ఈ నేపథ్యంలో ఆవిర్భవించిన విశిష్టమైన హనుమంతుడి ఆలయాలలో 'వెలిమినేడు' ఒకటిగా కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో దర్శనమిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ ఆలయం కనిపిస్తూ వుంటుంది. చూడటానికి ఆలయం చిన్నదే అయినప్పటికీ, ఇక్కడి హనుమంతుడికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. ఇక్కడి హనుమంతుడు చల్లని మనసున్న వాడని భక్తులు చెబుతుంటారు.
స్వామివారి అనుగ్రహం కారణంగా సంతానాన్ని ... సౌభాగ్యాన్ని పొందిన వాళ్లు ఎంతోమంది వున్నారు. ఇక ఆయన కరుణ వలన ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్లు ... పదవులను పొందిన వాళ్లు కూడా ఎక్కువగానే వున్నారు. స్వామిని పూజించిన పుణ్యఫలం కారణంగా అనారోగ్యాల బారి నుంచి బయటపడిన వారి సంఖ్య అపరిమితమని చెబుతారు. ప్రత్యేకమైన ప్రచారమంటూ ఏమీ లేకపోయినా, భక్తుల అనుభవాలే స్వామివారికి కావలసినంత ప్రచారాన్ని కల్పించాయి.
ఇలా మాటల ద్వారా ... మహిమల ద్వారానే వెలిమినేడు హనుమంతుడు ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఈ దారిలో వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా స్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు. సంతానాన్ని ... సౌభాగ్యాన్ని కోరుకునేవారు, నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ... నూతన వధూవరులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేయిస్తారు. ఇక ఈ దారిలో వెళుతున్నా ... వస్తున్నా రాజకీయ ప్రముఖులు స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రం మరిచిపోరు.
వెలిమినేడు హనుమంతుడు వైభవానికి కాస్త దూరంగా కనిపించినా, మహిమల విషయంలో సాటిలేనివాడని భక్తులు చెబుతుంటారు. ఇక ఈ ఆలయ ద్వారం చెంతనే ఒక చూపులేని వ్యక్తి కనిపిస్తాడు. చాలా సంవత్సరాలుగా ఆయన స్థానం అదే. స్వామి దర్శనం చేసుకున్న భక్తులు ఆయనకి ఎంతో కొంత దానం చేయకుండా వెనుదిరగరు. ఆయనకి దానం చేయడం వలన మంచి జరుగుతుందనే విశ్వాసాన్ని స్థానికులు వ్యక్తం చేస్తుంటారు.