అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్?

  • అట్లీ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న అల్లు అర్జున్ తాజా చిత్రం
  • హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అట్లీ బృందం 
అల్లు అర్జున్ తాజా చిత్రంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను నటింపజేసేందుకు దర్శకుడు అట్లీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన 56 ఏళ్ల విల్ స్మిత్ నిర్మాత కూడా. భారత్‌లో అద్భుతమైన విజయాలు సాధించిన మెన్ ఇన్ బ్లాక్ సిరీస్‌తో సహా అనేక చిత్రాల్లో ఆయన నటించారు. అయితే, ప్రస్తుతం విల్ స్మిత్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.

దీంతో విల్ స్మిత్‌ను అల్లు అర్జున్ చిత్రంలో ఒప్పించేందుకు నిర్మాణ బృందం ప్రయత్నాలు చేస్తోందని సినీ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే, అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్ నటిస్తారా లేదా అనే దానిపై ఇంతవరకూ స్పష్టత లేదు. అట్లీ బృందం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 


More Telugu News