Sivaji: మహిళా కమిషన్ విచారణకు హాజరైన సినీ నటుడు శివాజీ

Actor Sivaji Attends Women Commission Inquiry
  • మహిళలపై వ్యాఖ్యల వ్యవహారంలో నటుడు శివాజీకి నోటీసులు
  • వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్
  • దండోరా సినిమా వేడుకలో హీరోయిన్ల డ్రెస్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు
సినీ నటుడు శివాజీ ఇవాళ‌ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

ఇటీవల జరిగిన 'దండోరా' సినిమా వేడుకలో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ప్రసంగం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్, దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం శివాజీ వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

ఈ నెల 27న వ్య‌క్తిగ‌తంగా క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆయ‌న్ను ఆదేశించింది. కేవలం నోటీసులతోనే ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా దీనిపై లోతైన విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించిన‌ట్లు స‌మాచారం.
Sivaji
Sivaji actor
Telangana Women Commission
Dandora movie
movie event controversy
women's clothing comments
Sumoto case
controversial remarks
Telangana State
Tollywood

More Telugu News