Nizamabad ATM Robbery: ఏటీఎంల నుంచి 39 లక్షల చోరీ

Nizamabad SBI DCB ATMs Robbed Using Gas Cutter
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు ఏటీఎంలలో దొంగల బీభత్సం
  • రూ.39 లక్షల నగదు మాయం.. కొంత కాలిపోగా, మరికొంత చోరీ
  • ఈ దోపిడీలో ఐదుగురు సభ్యుల ముఠా పాల్గొందంటున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు రెండు ఏటీఎంలలో దొంగలు పడ్డారు. ముసుగులతో చొరబడి, గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో కొంత నగదు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఏటీఎం మెషిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు ఆర్యనగర్‌, సాయినగర్‌ లోని రెండు ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్‌ తో తెరిచి నగదు దోచుకెళ్లారు.

సాయినగర్‌ లోని ఎస్‌బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షలు, ఆర్యనగర్‌ లోని డీసీబీ ఏటీఎంలో సుమారు రూ.30 లక్షలు చోరీ అయ్యాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటీఎంలను తెరవడానికి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో కొంత నగదు కాలిపోయిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన ఏటీఎంలను పరిశీలించిన కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌ చంద్ర.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. 
Nizamabad ATM Robbery
Nizamabad
ATM robbery
Gas cutter
SBI ATM
DCB ATM
Crime news
Telangana police
Rajesh Chandra
Kamareddy SP

More Telugu News