ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి నిరాశ

  • స్థలం ఆక్రమణ కేసులో వంశీకి నిరాశ
  • కేసును వారంపాటు వాయిదా వేసిన హైకోర్టు
  • ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ
స్థలం ఆక్రమణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో, కేసును హైకోర్టు వారంపాటు వాయిదా వేసింది. 

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై ఈ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 


More Telugu News