Praful Desai: ప్రభుత్వ ఆసుపత్రిలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ భార్య ప్రసవం

Praful Desais Wife Delivers Baby at Government Hospital in Karimnagar
  • మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమిషనర్ భార్య
  • మొదటి కాన్పు కోసం నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరిన వైనం
  • తల్లీబిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించిన వైద్యులు
కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు. నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె గత కొంతకాలంగా మాతా శిశు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

మొదటి కాన్పు కోసం ఆమె నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెను పరీక్షించి, ఉమ్మనీరు తగ్గిన అనంతరం సోమవారం మధ్యాహ్నం శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. ఆడబిడ్డ జన్మించిందని, తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన నగరపాలక సంస్థ కమిషనర్ దంపతులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు.
Praful Desai
Karimnagar
Municipal Commissioner
Government Hospital
Childbirth

More Telugu News