Chandrababu Naidu: నారావారిపల్లె వెళుతూ సూర్యలంక బీచ్ పై ఏరియల్ సర్వే చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్

Chandrababu Naidu Conducts Aerial Survey of Suryalanka Beach Development
  • సూర్యలంక బీచ్ లో పర్యాటక రంగ అభివృద్ధి
  • రూ.97 కోట్లతో పనులు
  • హెలికాప్టర్ నుంచి పరిశీలించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సంక్రాంతి పండుగ కోసం తమ స్వగ్రామం నారావారిపల్లెకు హెలికాప్టర్‌లో వెళుతున్న సమయంలో వారు మార్గమధ్యంలో ఈ పనులను వీక్షించారు.

సూర్యలంక బీచ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ వసతులు, అడ్మినిస్ట్రేషన్ భవనం, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌తో పాటు ‘సూర్యలంక ఎక్స్‌పీరియన్స్ జోన్’ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనుల పురోగతిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గగనతలం నుంచి పరిశీలించారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ సాయంత్రం కుటుంబంతో కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. వారు జనవరి 15 వరకు అక్కడే బస చేయనున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు
Chandrababu Naidu
Nara Lokesh
Suryalanka Beach
Andhra Pradesh Tourism
Swadesh Darshan 2.0
Naravaripalle
AP CM
Tourism Development
Sankranti Festival
Aerial Survey

More Telugu News