పోలీసు క‌స్ట‌డీకి వ‌ల్ల‌భ‌నేని వంశీ

  • కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూక‌బ్జా కేసులో వంశీకి ఒక‌రోజు పోలీస్ క‌స్ట‌డీ
  • కంకిపాడు పీఎస్‌లో వైసీపీ నేత‌ను ప్ర‌శ్నిస్తున్న పోలీసులు
  • గ‌న్న‌వ‌రం కోర్టు శుక్ర‌వారం నాడు వంశీని ఒక‌రోజు పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తి
కృష్ణా జిల్లా ప‌రిధిలోని ఆత్కూరు భూక‌బ్జా కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒక‌రోజు క‌స్ట‌డీకి తీసుకున్నారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న్ను కంకిపాడు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ కేసుకు సంబంధించి వంశీని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. 

కాగా, గ‌న్న‌వ‌రం కోర్టు శుక్ర‌వారం నాడు వంశీని ఒక‌రోజు పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆత్కూరు పీఎస్ ప‌రిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధ‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు ఉంగుటూరు పోలీసులు వంశీపై కేసు న‌మోదు చేశారు. ఇక గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ప్ర‌స్తుతం విజ‌య‌వాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   


More Telugu News