విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు

  • హైదరాబాద్ బెంచ్‌కు చెందిన సర్క్యూట్ బెంచ్ విజయవాడలో ఏర్పాటు
  • ఈ నెల 17న వర్చువల్ విధానంలో సర్క్యూట్ బెంచ్ ప్రారంభిస్తామన్న క్యాట్ చైర్మన్ 
  • అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రభుత్వ బదిలీలు, ఇతర అంశాలపై క్యాట్‌ను ఆశ్రయించడం రివాజు
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 

హైదరాబాద్ బెంచ్‌కు చెందిన సర్క్యూట్ బెంచ్‌ను విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు విజయవాడ సర్క్యూట్ బెంచ్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 
 
అఖిల భారత సర్వీసు అధికారులు ప్రభుత్వ బదిలీలు, ఇతర అంశాలపై అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ బెంచ్‌కు తరచూ వెళ్ళేవారు. ఇక విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు అవుతుండటంతో ఉద్యోగులు హర్షం చేస్తున్నారు. 


More Telugu News