పసిడి అదరహో... బంగారానికి రికార్డు ధర

  • ఒక్కరోజులోనే రూ.1,100 పెరిగిన బంగారం ధర
  • 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.84,900
  • నెల రోజుల్లో రూ.5,510 పెరుగుదల
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా కొనుగోళ్లు పెరగడం వంటి కారణాలతో  పసిడి ధర పరుగులు పెడుతోంది. తాజాగా బంగారం ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.84,900 పలుకుతోంది. ఒక్కరోజులోనే బంగారం ధర రూ.1,100 పెరగడం దేశీయంగా నెలకొన్న డిమాండ్ కు అద్దం పడుతోంది. జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390 ఉంది. ఇప్పుడది రూ.5,510 మేర పెరిగింది. 

కాగా, బడ్జెట్ లో దిగుమతి సుంకం పెంచుతారని భావిస్తున్నారు. దాంతో బంగారం ధర పెరుగుతుందన్న అంచనాలతోనే కొనుగోళ్లు ఊపందుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 


డాలర్ తో పోల్చితే రూపాయి విలువ బలహీనంగా ఉండడం కూడా  బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News