కనుమూరు ఫారెస్ట్‌లో ఐదో రోజూ కొనసాగుతున్న పులి గాలింపు.. అందని జీపీఎస్ సిగ్నల్

Andhra
Advertisement
  • గంపలగూడెం ఫారెస్ట్‌లో తిష్టవేసిన పులి
  • పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా రంగంలోకి దిగిన పూణే నిపుణుల బృందం
  • రెండు రోజులుగా అందకుండా పోయిన జీపీఎస్ ట్రాకర్ సిగ్నల్స్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ ఐదో రోజుకు చేరింది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు అడవి నలువైపులా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

'ఎక్స్‌ప్లోరర్'గా పిలిచే ఈ పెద్దపులికి కనుమూరు ఫారెస్ట్‌లో ఆహారం, నీరు సమృద్ధిగా లభించడంతో పాటు అనువైన వాతావరణం ఉండటంతో ఇక్కడే తిష్టవేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా పులికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ నుంచి సంకేతాలు స్పష్టంగా అందడం లేదు. పులి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లడం వల్లే సిగ్నల్స్ సరిగా రావడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాకర్ సిగ్నల్స్ అందకపోయినప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటవీ ప్రాంతం చుట్టూ పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశారు.

పులిని బంధించేందుకు మహారాష్ట్రలోని పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. అటవీ ప్రాంతంలో ఇప్పటికే 2 బోన్లు ఏర్పాటు చేశారు. పులికి ఎటువంటి హాని కలగకుండా ట్రాంక్విలైజర్ గన్ ద్వారా మత్తు ఇచ్చి పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పులి సంచారం నేపథ్యంలో కనుమూరు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఒంటరిగా పొలాల వైపు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే గుంపులుగా టార్చ్ లైట్లతో వెళ్లాలని, పశువులను అడవికి దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. పులిని బంధించే వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Advertisement

సంబంధిత వార్తలు

TigerKanumuru ForestNTR DistrictGampalagudemTiger Search Operation

More Telugu News

కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం.. పాల్గొన్న సినీ నటుడు వెంకటేశ్

25 Nov, 11:41

మ్యాచ్‌కు ముందు యువీ ఇచ్చిన ఆ ఒక్క మంత్రంతో వైభవ్‌ ఊచకోత!

25 Nov, 11:40

పసిడి ప్రియులకు పండగ.. భారీగా పతనమైన బంగారం.. వెండి కూడా డౌన్!

25 Nov, 11:23

పాతికేళ్లకే బట్టతల భయం ఎందుకు? మీ శరీరంలో దాగున్న అసలు సమస్యలు ఇవే!

25 Nov, 11:10

మహాకాళుడి సేవలో భారత క్రికెటర్లు.. భస్మ హారతిలో పాల్గొన్న చాహల్, రాణా

25 Nov, 11:08

'మిస్ యూనివర్స్' విజేతగా ప్యూర్టోరికో సుందరి జెన్నిఫర్ బారెటో.. తల్లిగా కిరీటం గెలుచుకుని చరిత్ర

25 Nov, 11:07

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను పట్టించుకోకపోతే కొంపకొల్లేరే.. కంపెనీలకు సిస్కో సీఈవో చక్ రాబిన్స్ హై అలర్ట్!

25 Nov, 10:55

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది లేదు.. వివాదాలకు దూరంగా ఉంటా: కాశ్వి హీరానందానీ

25 Nov, 10:53

ఒకప్పటి హిట్ పెయిర్ మళ్లీ కలిశారు.. కెనడాలో రంభను కలిసిన ప్రభుదేవా!

25 Nov, 10:49

‘‘మేం బిచ్చగాళ్లం కాదు’’.. యూపీలో కాంగ్రెస్‌, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు

25 Nov, 10:47

సిరాజ్‌ను వివాదాల్లోకి లాగొద్దు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా

25 Nov, 10:45

రెక్కలు, రన్‌వే లేకుండా గాల్లోకి.. చైనాలో ఎగిరే కారు ప్రయోగం సక్సెస్.. ఇదిగో వీడియో!

25 Nov, 10:39

అనకొండను తాకిన కూతురు.. ‘అత్యంత ధైర్యవంతురాలు’ అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్!

25 Nov, 10:37

దలాల్ స్ట్రీట్‌లో కాసుల వర్షం.. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డుల దిశగా పరుగులు!

25 Nov, 10:36
..More Telugu News