కాకినాడ మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా
Advertisement
- ఒడిశా తీరంలో కాకినాడ మత్స్యకారుల గల్లంతు
- ఈ నెల 19 నుంచి ఏడుగురి ఆచూకీ మిస్సింగ్
- గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశం
- పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడిన పవన్ కల్యాణ్
- కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్లతో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో వీరి మోటరైజ్డ్ ఫిషింగ్ బోటుతో సంబంధాలు తెగిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న సముద్రంలోకి వేటకు వెళ్లిన ఈ మత్స్యకారులు పారాదీప్ పోర్టు సమీపానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే, 19 నుంచి బోటుతో పాటు సిబ్బంది మొబైల్ ఫోన్లు, బోటు ట్రాన్స్‌పాండర్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. జీపీఎస్ ద్వారా కూడా బోటు ఆచూకీ లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంపై స్పందించిన అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కాకినాడ, చెన్నై, ఒడిశాలోని కోస్ట్ గార్డ్ స్టేషన్లతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చేపట్టారు. భారత కోస్ట్ గార్డ్ సహాయం కోరుతూ కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారులు లేఖ రాశారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ బృందాలు పారాదీప్ తీర ప్రాంతంలో నౌకలు, హెలికాప్టర్లతో విస్తృతంగా గాలిస్తున్నాయి.
గాలింపు చర్యల పురోగతిని సమీక్షించిన సీఎం చంద్రబాబు, ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. బోటులో తగినంత ఇంధనం, ఆహార సామాగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్ అధికారులు వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతున్నారు.