హారన్ మోగని నగరం ఐజ్వాల్: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
Advertisement
- ఐజ్వాల్ ట్రాఫిక్ క్రమశిక్షణపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
- ట్రాఫిక్ జామ్ ఉన్నా హారన్ కొట్టని మిజోరం ప్రజలు
- నిశ్శబ్దం మెట్రో నగరాల్లో లగ్జరీగా మారిందన్న మహీంద్రా
- 2017 నుంచే ఐజ్వాల్‌లో నో హారన్ పాలసీ అమలు
- ప్రశాంతత కోసమే పర్యటనలు చేసే రోజులు వస్తాయన్న వ్యాపారవేత్త
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని విశిష్ట ట్రాఫిక్ క్రమశిక్షణపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతటి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా వాహనదారులు సంయమనం పాటిస్తూ, హారన్ల మోత లేకుండా క్రమశిక్షణతో వేచి ఉండే సంస్కృతిని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు.
ఆదివారం నాడు ఆయన షేర్ చేసిన వీడియోలో ఐజ్వాల్ రోడ్లపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఎక్కడా హారన్ల శబ్దం వినిపించకుండా రోడ్లన్నీ పూర్తి నిశ్శబ్దంగా కనిపించాయి. ఆ వీడియోలో కనిపించిన ఒక స్థానిక మహిళ మాట్లాడుతూ.. "ఇక్కడ చాలా వాహనాలు ఉన్నాయి, కానీ ఎవరూ హారన్ కొట్టరు. మిజో ప్రజలకు సహనం ఎక్కువ, నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు" అని వివరించారు. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయినా స్టాప్ లైన్ దాటకుండా, లేన్ జంపింగ్ చేయకుండా ప్రశాంతంగా వేచి ఉంటారని ఆమె తెలిపారు.
ఈ అంశంపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ తన #SundayWanderer సిరీస్‌లో ప్రత్యేకంగా రాసుకొచ్చారు. "మన రద్దీ నగరాల్లో నిశ్శబ్దం అనేది ఒక అరుదైన విలాసంగా మారిపోయింది" అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా పర్యాటకులు అందమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక కట్టడాల కోసం ప్రయాణాలు చేస్తుంటారని, అయితే భవిష్యత్తులో కేవలం ప్రశాంతత, నిశ్శబ్దం కోసమే ప్రజలు పర్యటనలు చేసినా ఆశ్చర్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐజ్వాల్‌లోని లేన్ క్రమశిక్షణ, ట్రాఫిక్ నియమాలపై ఆయన గతంలోనూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఐజ్వాల్ నగరానికి దేశంలోనే ‘సైలెంట్ సిటీ’గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇరుకైన కొండ ప్రాంత రోడ్లు ఉండటం వల్ల ఇక్కడ 2017 నుంచే ‘నో-హారన్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. స్థానిక సామాజిక నిబంధనల ప్రకారం అనవసరంగా హారన్ కొట్టడం లేదా ఓవర్‌టేక్ చేయడం తీవ్ర అభ్యంతరకరంగా భావిస్తారు. మిజోరం పోలీసులు కూడా హారన్ రహిత డ్రైవింగ్‌ను సాధారణ పద్ధతిగా ప్రోత్సహిస్తూ, ఐజ్వాల్‌ను అధికారికంగా 'నో హాంకింగ్ సిటీ'గా నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ గందరగోళం, తీవ్రమైన శబ్ద కాలుష్యం పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఐజ్వాల్ రోడ్లపై కనిపించే ఈ సంయమనం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.