దిశ మార్చుకుని, తీవ్ర తుపానుగా మారిన 'అక్వాన్'.. ఉత్తరాంధ్రకు హైఅలర్ట్
Advertisement
- నవంబర్ 20 మధ్యాహ్నం తీరం దాటనున్న తీవ్ర తుపాను అక్వాన్
- నరసాపురం పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న ఐఎండీ
- ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు బలమైన గాలుల హెచ్చరిక
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశం
- రంగంలోకి 13 ఎన్డీఆర్ఎఫ్ 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఇది దిశ మార్చుకుని, తీవ్ర తుపానుగా మారి ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం సహా దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఈ తీవ్ర తుపాను నవంబర్ 20 మధ్యాహ్నానికి నరసాపురం – పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అక్వాన్' తీవ్ర తుపాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలింది. ప్రస్తుతం ఇది నరసాపురానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పుగా 560 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పూరీకి దక్షిణంగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా ఉత్తర-వాయవ్య దిశలోనే ప్రయాణించి తీరం వైపు సాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. గురువారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాబోయే 48 గంటల పాటు అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తుపాను సహాయక చర్యల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా 13 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచినట్లు హోం మంత్రి తెలిపారు. అవసరమైన ప్రాంతాలకు తక్షణమే ఈ బృందాలను తరలించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు నిరంతరం పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, విజ్ఞప్తులపై వెంటనే స్పందించి సహాయం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.