బాబా జయంతి ఉత్సవాల స్పెషల్.. బెంగళూరు నుంచి ధర్మవరంకు స్పెషల్ ట్రైన్లు
Advertisement
- సత్యసాయిబాబా 101వ జయంతి
- నవంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేకు రైలు సర్వీసులు
- కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం
సత్యసాయిబాబా 101వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకలకు హాజరయ్యే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు - ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలును నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక అన్‌రిజర్వుడు రైలు సర్వీసు ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరు - ధర్మవరం (06525) ప్రత్యేక అన్‌రిజర్వుడు రైలు పేర్కొన్న తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 8:15 గంటలకు బెంగళూరులో బయలుదేరుతుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ రైలు ధర్మవరం చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో ధర్మవరం - బెంగళూరు (06526) ప్రత్యేక రైలు ధర్మవరంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5:50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
పుట్టపర్తిలో జరిగే సత్యసాయిబాబా 101వ జయంతి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. సాధారణ రైళ్లపై ఒత్తిడి తగ్గించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక అన్‌రిజర్వుడు సర్వీసును ప్రవేశపెట్టినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.