జంట తుపాన్ల వేళ కర్ణాటక పెద్ద మనసు.. సీఎం డీకే శివకుమార్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు

Andhra
Advertisement
  • విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణలో అండగా నిలిచిన కర్ణాటక సిబ్బంది
  • 68 బృందాలుగా 592 మంది ఏపీకి వచ్చి పనులు
  • విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించడంలో కీలక పాత్ర
  • ఇరు రాష్ట్రాల మధ్య భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక అనుబంధాలు బలంగా ఉన్నాయన్న చంద్రబాబు
  • ఇలాంటి పరస్పర సహకారం ఇరు రాష్ట్రాల మైత్రిని మరింత పటిష్ఠం చేస్తుందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ‘అర్నబ్’, ‘మురసు’ జంట తుపాన్ల విధ్వంసం నుంచి కోలుకునే క్రమంలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు సకాలంలో అండగా నిలిచిన కర్ణాటక ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు బుధవారం ఆయన అధికారిక లేఖ రాశారు. విపత్తు వేళ పొరుగు రాష్ట్రం చూపిన చొరవ, తక్షణ స్పందనను ఆయన లేఖలో ప్రత్యేకంగా ప్రశంసించారు.

జంట తుపాన్ల తీవ్రతకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిని సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సంక్షోభ సమయంలో కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించి 68 బృందాలుగా 592 మంది విద్యుత్ సిబ్బందిని ఆంధ్రప్రదేశ్‌కు పంపించింది. స్థానిక సిబ్బందితో కలిసి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసిన కర్ణాటక బృందాలు విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాయని చంద్రబాబు కొనియాడారు.

ఏపీ సీపీడీసీఎల్ పరిధిలోనే తుపాన్ల విధ్వంసం తీవ్రస్థాయిలో కనిపించింది. ‘అర్నబ్’ తుపాను కారణంగా 1,333 గ్రామాలు, ‘మురసు’ దాటికి 1,825 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే అర్నబ్ ప్రభావంతో 1,852 స్తంభాలు, మురసు ప్రభావంతో ఏకంగా 7,850 స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ వ్యవస్థకు పెను నష్టం వాటిల్లింది. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో అర్నబ్ తర్వాత 165 బృందాల్లో 1,580 మంది, మురసు తర్వాత 390 బృందాల్లో 3,292 మంది స్థానిక సిబ్బంది రంగంలోకి దిగగా, కర్ణాటక నుంచి వచ్చిన బృందాలు వారికి అదనపు బలాన్ని చేకూర్చాయని సీఎం వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందించుకునే ఇలాంటి పరస్పర సహకారం ఇరు రాష్ట్రాల మైత్రిని మరింత పటిష్ఠం చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కర్ణాటకకు ఎటువంటి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా సిబ్బంది, యంత్ర పరికరాలు, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో హామీ ఇచ్చారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduDK ShivakumarCyclone ArnabCyclone MurasuAndhra Pradesh Karnataka relationsPower restoration help

More Telugu News

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిదే విజయం: పల్లా శ్రీనివాసరావు

18 Nov, 17:03

స్టాక్ మార్కెట్లకు ప్రాఫిట్ బుకింగ్ షాక్.. 500 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్!

18 Nov, 16:53

జగన్ ఆస్తుల కేసులో మరో చార్జిషీట్ దాఖలు

18 Nov, 16:47

బాబా జయంతి ఉత్సవాల స్పెషల్.. బెంగళూరు నుంచి ధర్మవరంకు స్పెషల్ ట్రైన్లు

18 Nov, 16:47

రాబోయే 23 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమిని ఆశీర్వదించండి: నాదెండ్ల

18 Nov, 16:41

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష

18 Nov, 16:31

జియో సిమ్ యూజర్లకు అలర్ట్: రీఛార్జ్ చేయకపోతే ఇన్‌కమింగ్ కాల్స్ ఆగిపోతాయా?

18 Nov, 16:12

సుకన్య సమృద్ధి యోజన: నెలకు రూ.12,500 కడితే కూతురి ఖాతాలో రూ.70 లక్షలు!

18 Nov, 15:58

త్వరలో డెలివరీ.. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన సమంత.. ఫొటోలు ఇవిగో!

18 Nov, 15:35

బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. రూ.51కే అపరిమిత కాల్స్‌, రోజు 2జీబీ హైస్పీడ్‌ డేటా

18 Nov, 15:35

రెనియం పౌడర్ తో బంగారం కల్తీ.. సాధారణ పరీక్షలకు దొరకదు!

18 Nov, 15:14

నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రమే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక!

18 Nov, 15:03

అనంతపురం జిల్లాలో దారుణం.. టీడీపీ అభ్యర్థి చెవికొరికేసిన వైసీపీ అభ్యర్థి!

18 Nov, 14:50

గత ఆంధ్ర పాలకుల కంటే రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతోంది: కేటీఆర్

18 Nov, 14:49
..More Telugu News