అభిమానులు నేను తప్పు అని నిరూపించారు.. ఇంతకంటే మంచి పాట మరొకటి లేదు: ధోనీ ఎమోషనల్ పోస్ట్
Advertisement
- ఐపీఎల్‌కు అధికారికంగా వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ
- ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక వీడియో పంచుకున్న మిస్టర్ కూల్
- ధోనీ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సీఎస్‌కే
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అధికారికంగా వీడ్కోలు పలికారు. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలో 1976 నాటి ‘కభీ కభీ’ చిత్రంలోని 'మై పల్ దో పల్ కా షాయర్ హూ' పాటను ఉపయోగించిన ధోనీ, ఇప్పుడు ఐపీఎల్ రిటైర్మెంట్ కోసం అదే సినిమాలోని 'మై హర్ ఏక్ పల్ కా షాయర్ హూ' పాటను ఎంచుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి తనకు లభిస్తున్న ఆదరణను ప్రతిబింబించేలా ఈ పాటతో తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
తాజాగా ధోనీ పోస్ట్ చేసిన వీడియోలో తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పొందుపరిచారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సర్లు, ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సాధించిన 209 పరుగుల ఇన్నింగ్స్, వన్డేల్లో విరాట్ కోహ్లీ 10000 పరుగుల మైలురాయిని చేరుకోవడం వంటి భారత జట్టుకు సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.
అలాగే సీఎస్‌కేతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని కూడా ధోనీ ఈ వీడియో ద్వారా నెమరువేసుకున్నారు. 2010, 2018 సీజన్ల ట్రోఫీ విజయాలు, పంజాబ్ కింగ్స్‌పై 2010లో ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్, 2023 ఫైనల్ గెలిచిన అనంతరం రవీంద్ర జడేజాను ఎత్తుకున్న దృశ్యాలు, 2024 ఐపీఎల్ జ్ఞాపకాలు ఇందులో చోటుచేసుకున్నాయి. ఈ వీడియోకు క్యాప్షన్ ఇస్తూ... "అభిమానులు నేను తప్పు అని నిరూపించారు. దాన్ని అంగీకరించడానికి ఇంతకంటే మంచి పాట మరొకటి లేదు. బహుశా నేను తప్పు చేసి, ఆ తర్వాత దాన్ని ఒప్పుకోవడానికేనేమో ఈ పాటకు రెండు వర్షన్లు రూపొందించారు" అని ధోనీ పేర్కొన్నారు.
అంతకుముందు ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "లెక్కలేనన్ని విజయాలు, సవాళ్లు, గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలతో కూడిన మా ప్రయాణంలో మొదటి నుంచీ ధోనీ కీలక భాగంగా ఉన్నారు. జట్టును విజయపథంలో నడిపించడం నుంచి భవిష్యత్ తరం సూపర్ కింగ్స్‌కు మార్గదర్శనం చేయడం వరకు మా గుర్తింపుగా 'తల' ఎప్పటికీ నిలుస్తారు. చెన్నై ఎల్లప్పుడూ ఆయన సొంత ఇల్లే" అని సీఎస్‌కే తమ 'ఎక్స్' ఖాతాలో పేర్కొంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగారు. 2022 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ, ఆ తర్వాత ధోనీ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2024 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు.