అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల లెక్క.. అరెస్ట్ పై పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచన!

National
Advertisement
  • వాస్తవ నిర్బంధ సమయం నుంచే 24 గంటల లెక్క
  • అధికారిక అరెస్టు నమోదు సమయం ప్రాతిపదిక కాదన్న సుప్రీం
  • ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించాలని సూచన
  • గడువు దాటితే వెంటనే విడుదల చేయాలని స్పష్టీకరణ
  • అసలు నిర్బంధ సమయాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేయాలని సూచన
Advertisement
అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాలన్న రాజ్యాంగ నిబంధనపై సుప్రీంకోర్టు కీలక వివరణ ఇచ్చింది. పోలీసులు అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచి కాకుండా.. వాస్తవంగా నిర్బంధించిన క్షణం నుంచే లెక్కించాలని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించి అదుపులోకి తీసుకున్న సమయమే ఈ గడువుకు ప్రాతిపదిక అని తేల్చిచెప్పింది.

త్రిపురలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నమోదైన కేసులో బెయిల్‌ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(2) ప్రకారం అరెస్టయిన వ్యక్తిని ప్రయాణానికి అవసరమైన సమయాన్ని మినహాయించి 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాలి. మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా అంతకుమించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు. 

సోదాలు, స్వాధీనం ప్రక్రియ పూర్తయ్యాక పోలీసులు అధికారికంగా అరెస్టు నమోదు చేసినప్పటి నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని భావించడం చట్టవిరుద్ధమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వాస్తవంగా నిర్బంధించిన సమయం నుంచి 24 గంటలు దాటినా మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచకపోతే సంబంధిత వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ గడువును లెక్కించేటప్పుడు అరెస్టు చేసిన ప్రాంతం నుంచి మేజిస్ట్రేట్‌ కోర్టుకు చేరుకోవడానికి పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించాలని స్పష్టం చేసింది.

అంతేకాదు, 24 గంటల్లోగా కోర్టు ఎదుట హాజరుపరిచినంత మాత్రాన నిర్బంధం చట్టబద్ధమైనట్లు కాదని ధర్మాసనం తెలిపింది. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 58 ప్రకారం.. కేసు పరిస్థితులకు అనుగుణంగా నిర్బంధ సమయం సహేతుకంగా ఉండేలా దర్యాప్తు సంస్థలు చూసుకోవాలని పేర్కొంది.

నిందితుడిని తమ ఎదుట హాజరుపరిచినప్పుడు అతడి స్వేచ్ఛకు భంగం కలిగించిన అసలు తేదీ, సమయాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగం నిర్దేశించిన 24 గంటల గడువు పాటించారా? లేదా? అన్నది స్వతంత్రంగా పరిశీలించాలని సూచించింది. నిర్బంధం సహేతుకమైన సమయాన్ని మించిందని భావిస్తే తదుపరి రిమాండ్‌కు అనుమతి నిరాకరించే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

Supreme Court of India24 hour arrest ruleArticle 22 2Actual detention timePolice arrest guidelinesMagistrate production

More Telugu News

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30

కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు

05 Nov, 16:15

"సాయన్న పేరులోనే సాయముందిరా!".. పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి

05 Nov, 16:13

ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ బాటలో మెటా!

05 Nov, 16:13

సౌత్ నటిననే వివక్ష చూపారు: కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన ఆరోపణలు

05 Nov, 15:52

అయ్యప్ప సొసైటీపై సర్వే చేయాలి: రేవంత్ సర్కారుకు కవిత నెల రోజుల డెడ్‌లైన్

05 Nov, 15:48

ఐపీఎల్ ట్రేడింగ్: సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మెగా డీల్.. సగం ధరకే లివింగ్‌స్టోన్ చెన్నై గూటికి!

05 Nov, 15:43

బ్లింకిట్‌ అంబులెన్స్‌ బుకింగ్‌లో కొత్త రూల్‌.. అత్యవసరం కాని ప్రయాణానికి రూ.2,500!

05 Nov, 15:42

‘రామాయణ’ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటుతుంది: అట్లీ

05 Nov, 15:31

క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోం మంత్రి అనిత

05 Nov, 15:04

విజువల్ వండర్.. 'రామాయణ'పై రాజమౌళి రివ్యూ

05 Nov, 15:02

పార్లమెంటుకు రండి చర్చిద్దాం.. రాహుల్‌కు అమిత్‌ షా సవాల్‌!

05 Nov, 15:01
..More Telugu News