విదేశాలకు వెళ్తున్నారా?.. మీ వాట్సాప్‌పై ప్రభావం చూపే కొత్త నిబంధన!

National
Advertisement
  • వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త 'సిమ్ బైండింగ్' నిబంధన
  • అకౌంట్‌తో లింక్ అయిన సిమ్ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉంటేనే యాప్ పనిచేస్తుంది
  • విదేశీ ప్రయాణికులు, వ్యాపారాలకు తీవ్ర ఇబ్బందులని తాజా అధ్యయనంలో వెల్లడి
  • సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యమంటున్న టెలికాం శాఖ
  • 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
Advertisement
వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త నిబంధన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'సిమ్ బైండింగ్' పేరుతో అమలు చేయనున్న ఈ రూల్ ప్రకారం, ఒక వ్యక్తి తన వాట్సాప్ అకౌంట్‌ను ఏ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకున్నాడో, ఆ సిమ్ కార్డు తప్పనిసరిగా అదే ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండాలి. లేకపోతే ఆ యాప్ పనిచేయదు. సైబర్ మోసాలు, భారత మొబైల్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో టెలికాం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

అయితే, ప్రభుత్వ నిర్ణయంపై 'ఈశ్యా సెంటర్' అనే థింక్ ట్యాంక్ సంస్థ నిర్వహించిన అధ్యయనం తీవ్ర ఆందోళనలను తెరపైకి తెచ్చింది. 'రీథింకింగ్ ఇండియాస్ సిమ్ బైండింగ్ మ్యాండేట్' పేరుతో 18 నగరాల్లో 2,033 మంది వినియోగదారులు, 17 నగరాల్లో 353 వ్యాపార సంస్థలపై జరిపిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నిబంధన వల్ల విదేశాలకు ప్రయాణించే వారికి, వ్యాపార సంస్థలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఈ అధ్యయనం హెచ్చరించింది.

సర్వే ప్రకారం విదేశాలకు వెళ్లే వారిలో కేవలం 33% మంది మాత్రమే తమ భారత సిమ్‌పై అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ వాడుతున్నారు. మిగిలిన 67% మంది అక్కడి స్థానిక సిమ్ కార్డులు, వైఫై లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో భారత సిమ్ యాక్టివ్‌గా లేనందున, వారు వాట్సాప్ వంటి ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనాలకు దూరమవుతారు. ఇది అత్యంత అసౌకర్యంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 98.88% మంది అభిప్రాయపడ్డారు.

ఈ నిబంధన ప్రభావం వ్యాపార కార్యకలాపాలపై కూడా తీవ్రంగా ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వ్యాపారాల్లో 92% సంస్థలు వాట్సాప్ వెబ్ వంటి కంపానియన్ డివైజ్‌లపై ఆధారపడుతుండగా, 86% సంస్థలు ఒకే బిజినెస్ నంబర్‌ను పలువురు ఉద్యోగులు వేర్వేరు డివైజ్‌లలో వాడుతున్నారు. సిమ్ బైండింగ్ వల్ల యాప్‌ను ఒకే ఫోన్‌కు పరిమితం చేస్తే, తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని 78% వ్యాపారాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల పనుల్లో జాప్యం, పొరపాట్లు జరిగే అవకాశం ఉందని 83.5% సంస్థలు తెలిపాయి.

వాస్తవానికి ఈ నిబంధనలను 2026 మార్చి 28 కల్లా అమలు చేయాలని టెలికాం శాఖ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. భద్రతా కారణాలతో ప్రభుత్వం ఈ నిబంధనను సమర్థిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఈ సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

SIM BindingWhatsApp New RulesDepartment of TelecommunicationsInternational TravelersCyber Fraud PreventionEsya Centre Study

More Telugu News

రాప్తాడు ఘటన.. తన సినిమాలపై ట్రోల్స్‌కు సందీప్ రెడ్డి వంగా ఘాటు కౌంటర్!

04 Nov, 14:20

మియాపూర్ భూములు అమ్మొద్దు, పేదలకు పంచివ్వండి: కేటీఆర్

04 Nov, 14:08

వయసు పెరిగినా తగ్గని జోరు.. "ఇంకా 21 ఏళ్ల అమ్మాయినే అనుకుంటా" అంటున్న సింధు

04 Nov, 14:02

యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి.. వ్యంగ్యంగా స్పందించిన ఎలాన్ మస్క్

04 Nov, 13:48

రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విజిలెన్స్‌ విచారణకు కేరళం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

04 Nov, 13:41

'ఇమ్మోర్టల్ ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

04 Nov, 13:38

అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం.. చరిత్ర సృష్టించిన అబ్దుల్

04 Nov, 13:33

ఏడాది ముందే ఎల్‌నినో ముప్పు పసిగట్టొచ్చు.. శాస్త్రవేత్తల కొత్త పరిశోధన!

04 Nov, 13:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి: కూటమి పార్టీల నేతలకు చంద్రబాబు పిలుపు

04 Nov, 13:29

నా వికెట్ సెలబ్రేషన్ ఆమె కోసమే.. సీక్రెట్ చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

04 Nov, 13:16

ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

04 Nov, 13:00

నంబర్‌ 3లో కోహ్లీ కింగ్‌.. వన్డేల్లో 13 వేల పరుగులతో ప్రపంచ రికార్డు!

04 Nov, 12:58

నా ఆఫర్‌ను నజ్రియా మూడుసార్లు తిరస్కరించింది: సూర్య

04 Nov, 12:45

వికెట్‌ కోసం అత్యాశకు పోయాం.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తప్పును అంగీకరించిన అర్ష్‌దీప్‌!

04 Nov, 12:43
..More Telugu News