రిపబ్లికన్ కంచుకోటలో పాగా వేసిన డెమొక్రాట్.. కాన్సస్‌లో 94 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం
Advertisement
- కాన్సస్ సెనేట్ ఎన్నికల్లో డెమొక్రాట్ ఆడమ్ హామిల్టన్ చారిత్రక విజయం
- 1932 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి డెమొక్రాట్‌గా రికార్డు
- సిట్టింగ్ రిపబ్లికన్ సెనేటర్ రోజర్ మార్షల్‌కు అనూహ్య ఓటమి
- ట్రంప్ ప్రచారం చేసినప్పటికీ గెలవలేకపోయిన రిపబ్లికన్ అభ్యర్థి
Advertisement
అమెరికా సెనేట్ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది. రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉన్న కాన్సస్ రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ దాదాపు 94 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం సాధించారు. 1932 తర్వాత, కాన్సస్ నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి డెమొక్రాట్‌గా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ గెలుపుతో సెనేట్‌పై పట్టు సాధించాలని చూస్తున్న డెమొక్రాట్లకు ఊహించని బలం చేకూరినట్లయింది.
సిట్టింగ్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రోజర్ మార్షల్ (66) ఓటమికి ఆయన వ్యక్తిగత నేపథ్యమే ప్రధాన కారణంగా నిలిచింది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రసూతి వైద్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఫీజులు చెల్లించలేదన్న కారణంతో వందలాది మంది రోగులపై కేసులు పెట్టినట్లు 'న్యూయార్క్ టైమ్స్' గతంలో ఒక కథనాన్ని ప్రచురించింది. కోర్టుకు హాజరుకాని వారిలో కొందరిని అరెస్ట్ కూడా చేయించారు. ఈ స్కాండల్ ఆయన పునరెన్నికపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఇంధన, ఎరువుల ధరల పెరుగుదల వల్ల వ్యవసాయ ఆధారిత కాన్సస్ తీవ్రంగా దెబ్బతినడం కూడా మార్షల్‌కు వ్యతిరేకంగా పనిచేసింది.
మరోవైపు, డెమొక్రాటిక్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ (62) ఒక పాస్టర్. కాన్సస్ సిటీ ప్రాంతంలోని అతిపెద్ద చర్చికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. తాను 'స్వతంత్ర భావాలున్న డెమొక్రాట్‌ను' అని ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రానికి ఇరు పార్టీల నుంచి ఒక్కో సెనేటర్ ఉంటే మేలు జరుగుతుందని, తాను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మార్షల్ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు కూడా ఉన్నాయి. 2025 ప్రారంభంలో జరిగిన ఒక టౌన్ హాల్ సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన బహిరంగ సమావేశాలు నిర్వహించలేదు.
సాధారణంగా కాన్సస్ రిపబ్లికన్ల అడ్డా. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ 16 పాయింట్ల తేడాతో గెలిచారు. ఈసారి కూడా మార్షల్ గెలుపు కోసం ట్రంప్ అక్టోబర్ చివరలో భారీ ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు.