మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

Telangana
Advertisement
  • ప్రయాణికురాలితో గొడవలో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
  • పది రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
Advertisement
ప్రయాణికురాలితో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీఎస్‌ఆర్టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె, నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రవళిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి అన్నారు. "ప్రవళిక కోలుకుని తిరిగి వస్తుందని ఆశించాం. కానీ ఆమె మృతి చెందడం చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం" అని ఆయన స్పష్టం చేశారు.

అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలు బానోతు మౌనికతో ప్రవళికకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు... ప్రవళికను కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేసింది. దీంతో బస్సు వెనుక చక్రాల కింద పడి ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

ప్రవళిక మృతికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం బస్సుల బంద్‌కు, రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Gundla PravalikaTSRTCPonnam PrabhakarWoman Conductor DeathManuguru DepotTelangana Transport Department

More Telugu News

ఫీల్డింగ్‌లో రో-కో మెరుపులు.. కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. రోహిత్‌ అదిరిపోయే రనౌట్‌!

04 Nov, 11:41

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

04 Nov, 11:21

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

04 Nov, 11:20

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08

ధన త్రయోదశి షాక్.. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు!

04 Nov, 10:57

‘‘నేను నేరుగా బరిలో ఉంటేనా’’.. మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ తొలి స్పందన!

04 Nov, 10:52

నా ఫేవరెట్ కెప్టెన్లు ఆ ఇద్ద‌రే.. నా కెప్టెన్సీ మాత్రం కష్టకాలంలో గడిచింది: సచిన్

04 Nov, 10:50

అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఫ్లోరిడాలో భారత సంతతి మహిళ పియా దండియా ఘన విజయం

04 Nov, 10:42

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి కొత్త సారథి

04 Nov, 10:39
..More Telugu News