జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు
Advertisement
- రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కూటమికి 95 శాతం స్థానాలు
- జగన్ విధ్వంస పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదనడానికి ఇదే నిదర్శనం
- సూపర్ సిక్స్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే గెలుపునకు కారణం
- ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమికేనని తేలింది
- కార్యకర్తల కష్టం, ప్రజల నమ్మకానికి దక్కిన గుర్తింపు ఈ విజయం
Advertisement
రాష్ట్రంలోని పురపాలక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చారిత్రక విజయం దిశగా దూసుకుపోతోంది. దాదాపు 95 శాతం స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ అపూర్వ విజయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు తమ ఓటు ద్వారా సంపూర్ణ ఆమోదముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విజయం కూటమి కార్యకర్తల అహర్నిశల శ్రమకు, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి దక్కిన గుర్తింపు అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిబద్ధత, యువనేత నారా లోకేశ్ దార్శనికతతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష తార్కాణమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఉన్న పటిష్టమైన ఐక్యతకు, రాష్ట్ర ప్రగతికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ప్రజలు జై కొట్టారన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీల జెండాలను భుజాన మోసి, గెలుపు కోసం అలుపెరగకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్ విధ్వంస పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు
జగన్ సాగించిన ఐదేళ్ల విధ్వంస పాలనను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే పురపాలక ఎన్నికల్లోనూ ప్రజలు పునరావృతం చేశారని, వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. ఇప్పటికైనా ఆ 'గొడ్డలి పార్టీ' తమ తప్పుడు, విష ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఏకంగా 62 పిటిషన్లను కోర్టుల్లో దాఖలు చేసి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.
"ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ, ఎక్కడో ఏదో జరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారాలతో ప్రజలను భయపెట్టాలని చూశారు. కానీ, ప్రజలు చాలా విజ్ఞులు. ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు మోసం చేస్తున్నారో వారికి పూర్తి స్పష్టత ఉంది. అందుకే వైసీపీని మరోసారి చిత్తుచిత్తుగా ఓడించారు" అని పల్లా పేర్కొన్నారు.
బ్యాలెట్ అయినా.. ఈవీఎం అయినా.. తీర్పు ఒక్కటే
ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగినా కూటమి పార్టీలకే ప్రజలు పట్టం కట్టారని, దీన్నిబట్టి ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా ప్రజల నమ్మకం కూటమిపైనే ఉందని నిరూపితమైందని పల్లా తెలిపారు. పులివెందుల, పుంగనూరు వంటి ప్రాంతాల్లో వైసీపీ సృష్టించిన ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు. ఈ అద్భుత విజయం క్షేత్రస్థాయిలో శ్రమించిన కూటమి కార్యకర్తల కష్టానికి దక్కిన ఫలితమని, పార్టీల జెండాలు మోసి పోరాడిన ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
సంక్షేమం, అభివృద్ధే విజయానికి బాటలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'సూపర్ సిక్స్' హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తుండటమే ఈ విజయానికి ప్రధాన కారణమని పల్లా శ్రీనివాసరావు విశ్లేషించారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించే 'దీపం 2.0' వంటి పథకాలు ప్రజల్లో ప్రభుత్వానికి కొండంత నమ్మకాన్ని పెంచాయన్నారు.
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అమరావతి, పోలవరం పనులను వేగవంతం చేయడం, పారిశ్రామిక ప్రగతికి బాటలు వేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికే రావడం కూటమి నాయకత్వంపై పారిశ్రామికవేత్తలకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ గెలుపుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని, 2029లో మళ్లీ సగర్వంగా ప్రజల ముందుకు వస్తామని పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.