నగరి, పుత్తూరులో పలు వార్డులు గెలుచుకున్న వైసీపీ.. కూటమిపై రోజా ఫైర్

Andhra
Advertisement
  • రోజాను కలిసిన వైసీపీ విజేతలు
  • విజేతలను అభినందించిన రోజా
  • మూడు పార్టీలు కలిసి వైసీపీపై పోటీ చేశాయని వ్యాఖ్య
Advertisement
నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డులను వైసీపీ కైవసం చేసుకోగా, పుత్తూరులో 4 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. నగరిలో 3, 15, 18, 23, 26, 28, 38 వార్డులతో పాటు, పుత్తూరులో 4, 27, 29, 36 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు మాజీ మంత్రి రోజాను కలిశారు. ఈ సందర్భంగా విజేతలను రోజా అభినందించారు. అనంతరం రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో రౌడీయిజం, గూండాయిజంతో తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. మూడు పార్టీలు కలిసి వైసీపీపై పోటీ చేశాయని, అయినప్పటికీ తమ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలవడం సంతోషంగా ఉందని అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని రోజా మండిపడ్డారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం విజయాలు సాధించిందని విమర్శించారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఆమె స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో రౌడీ రాజకీయాలకు ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారని, కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

RK RojaYSRCP victoryNagari municipality election resultsPuttur municipality resultsAndhra Pradesh local body electionsAP Alliance government

More Telugu News

వంట వస్తేనే పెళ్లి.. భార్య రితికాపై చేసిన ప్రాంక్‌ను బయటపెట్టిన రోహిత్ శర్మ!

03 Nov, 17:56

ట్రంప్‌కు అగ్నిపరీక్ష.. అమెరికాలో మొదలైన మధ్యంతర ఎన్నికల పోలింగ్

03 Nov, 17:50

స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. ఇది సుపరిపాలనకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు

03 Nov, 17:29

భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ బంపరాఫర్‌.. అర్హత ఉంటే రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ వీసా

03 Nov, 17:23

వైఎస్ కుటుంబం కంచుకోట పులివెందులలో టీడీపీ ప్రభంజనం.. ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో భారీ ఆధిక్యం

03 Nov, 17:09

కుల్‌దీప్‌కు అవకాశాలివ్వకపోవడం మిస్టరీ.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై మాజీ స్పిన్నర్‌ అసంతృప్తి

03 Nov, 17:01

'అక్క' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

03 Nov, 16:37

ఆర్టీజీఎస్‌, టెక్నాలజీతో తుపానుల గండం గట్టెక్కాం: సీఎం చంద్రబాబు

03 Nov, 16:36

దలాల్‌ స్ట్రీట్‌లో దూసుకెళ్లిన సూచీలు.. సెన్సెక్స్‌ 1,225 పాయింట్లు జంప్‌

03 Nov, 16:36

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. వైసీపీకి సున్నా

03 Nov, 16:22

ముందే వచ్చిన కాలుష్య సంక్షోభం.. ఢిల్లీకి పాక్ పొగ సెగ

03 Nov, 16:20

అణు దాడి జరిగితే 24 గంటలు బయటకు రావొద్దు.. ప్రజలకు ఇరాన్‌ సంచలన సూచనలు!

03 Nov, 16:16

టైగర్ ష్రాఫ్ ఘటన ఎఫెక్ట్.. భద్రతా వలయంలోకి బాలీవుడ్.. బిక్కుబిక్కుమంటున్న స్టార్లు!

03 Nov, 16:08

ఆత్మకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం.. చైర్‌పర్సన్‌గా షకీలా గెలుపు

03 Nov, 16:04
..More Telugu News