అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

Both States
Advertisement
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చిరంజీవి, రామ్ చరణ్
  • ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై ఆందోళన
  • అంశాన్ని పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ
  • రాతపూర్వక వినతిపత్రం ఇవ్వాలని సూచించిన హోంమంత్రి
  • ఈ వ్యవహారాన్ని కిషన్ రెడ్డి సమన్వయం చేస్తారని తెలిపిన చిరంజీవి
Advertisement
సోమవారం నాడు హైదరాబాదులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. ఇటీవల సినీ పరిశ్రమను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై వారు హోంమంత్రికి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఆందోళనను సావధానంగా విన్న అమిత్ షా, ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి కఠినమైన నిబంధనలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీపై చిరంజీవి, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం సంతోషంగా ఉంది. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల కళాకారుల హక్కులు, గౌరవానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్న నా ఆందోళనను ఆయనతో పంచుకున్నాను. ఆయన మా సమస్యను అర్థం చేసుకుని, ఈ అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలిస్తుందని, కఠినమైన నిబంధనలు, శిక్షలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాతపూర్వకంగా వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సమన్వయం చేస్తారని తెలిపారు. ఆయన హామీకి కృతజ్ఞతలు" అంటే చిరంజీవి ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ స్పందిస్తూ.. "ఈ రోజు నాన్నగారితో కలిసి హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. డీప్‌ఫేక్ వల్ల కళాకారులపై, పరిశ్రమపై పడుతున్న తీవ్ర ప్రభావం గురించి మేం వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించడం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన ఇచ్చిన హామీ మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. మా ఆందోళనను అర్థం చేసుకుని, మద్దతు తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు" అని తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

ChiranjeeviRam CharanAmit ShahDeepfake technologyArtificial IntelligenceFilm industry issues

More Telugu News

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01
..More Telugu News