ప్రకటనల స్థానంలో పోర్న్ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్ బోర్డ్‌లు హ్యాక్!
Advertisement
- పలు దేశాల్లో డిజిటల్ హోర్డింగ్స్‌పై సైబర్ దాడులు
- ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోల ప్రసారం
- ఈజిప్ట్, మలేసియా, బ్రెజిల్‌లో ఘటనలు
- హ్యాకింగ్‌కు సాఫ్ట్‌వేర్ భద్రతా లోపాలే కారణమని అనుమానం
- ‘లీకర్స్’ బృందం దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన
Advertisement
పలు దేశాల్లో హైవేల పక్కన ఏర్పాటు చేసిన డిజిటల్ హోర్డింగ్స్‌ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. సాధారణ ప్రకటనలు ప్రసారం కావాల్సిన తెరలపై అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అక్టోబర్ 29న ఈజిప్ట్, మలేసియాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా, బ్రెజిల్‌లోనూ ఇలాంటి సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనలతో డిజిటల్ ప్రకటనల వ్యవస్థల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈజిప్టులోని గిజా ప్రాంతంలో, కైరోకు సమీపంలోని రద్దీగా ఉండే '26 జులై యాక్సిస్' కారిడార్ హైవే పక్కన ఉన్న భారీ డిజిటల్ హోర్డింగ్‌పై అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయి. వాహనదారులు వాటిని తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించాయి. ఈ హోర్డింగ్‌ను నిర్వహించే ‘అల్ అరేబియా యునైటెడ్ అడ్వర్టైజింగ్ కంపెనీ’ ప్రసారాన్ని నిలిపివేసి, అధికారులతో కలిసి దర్యాప్తు చేపట్టింది.
మలేసియాలోని జోహోర్ రాష్ట్రం క్లువాంగ్ పట్టణంలోనూ పలు ఎల్‌ఈడీ తెరలపై అభ్యంతరకర దృశ్యాలు కనిపించాయి. దీంతో పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఆ తెరల ప్రసారాలను నిలిపివేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రెజిల్‌లోని పియావీ రాష్ట్రం కాంపో మాయోర్ ప్రాంతంలోనూ ఓ డిజిటల్ ప్యానెల్‌పై అశ్లీల దృశ్యాలు ప్రసారమైనట్లు సమాచారం. సంబంధిత సంస్థ సైబర్ దాడిని ధ్రువీకరించి, పరికరాన్ని నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘లీకర్స్’గా చెప్పుకుంటున్న హ్యాకింగ్ బృందం ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించింది. డిజిటల్ తెరలకు ప్రకటనల కంటెంట్‌ను పంపించే సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను ఉపయోగించుకున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్‌లో బలహీనంగా రక్షణ కలిగిన వ్యవస్థలను గుర్తించేందుకు తమకు సుమారు రెండు గంటలే పట్టిందని ఆ బృందం పేర్కొంది. ఇరాక్, చైనాలోనూ ఇలాంటి దాడులు చేశామని బృందం చెప్పినప్పటికీ, ఆ దేశాల్లో ఘటనలు జరిగినట్లు అధికారిక సమాచారం లేదు.
ఈజిప్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, పలు దేశాల్లో ప్రకటనల కంటెంట్‌ను పంపిణీ చేసే ఓ అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరగడంతో అనధికారిక వీడియోలు ఒకేసారి పలు తెరలపై ప్రసారమయ్యాయి. అయితే ఆ సంస్థ పేరును అధికారులు వెల్లడించలేదు. డిజిటల్ హోర్డింగ్స్‌ను దూరం నుంచి నియంత్రించే వ్యవస్థలకు బలమైన పాస్‌వర్డ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, అదనపు భద్రతా చర్యలు అవసరమని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.