హార్దిక్ పాండ్యా కోసం కేకేఆర్ పట్టు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడుగుతున్న ముంబై!
Advertisement
- హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు కేకేఆర్ గట్టి ప్రయత్నాలు
- హార్దిక్‌కు బదులుగా హర్షిత్ రాణా, రఘువంశీలను కోరుతున్న ముంబై
- రింకూ, నరైన్, వరుణ్‌లను వదులుకునేది లేదని స్పష్టం చేసిన కేకేఆర్
- రేసులో రాజస్థాన్, చెన్నై కూడా.. వారి ప్రతిపాదనలు విఫలం
Advertisement
ఐపీఎల్ 2027 వేలానికి ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకురావడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ డీల్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ (ఎంఐ) పెడుతున్న షరతులు చర్చలకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై.. హార్దిక్‌కు బదులుగా తమకు పేసర్ హర్షిత్ రాణా, యువ వికెట్ కీపర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు 'టెలిగ్రాఫ్' నివేదిక పేర్కొంది.
మరోవైపు, ఈ ట్రేడింగ్‌లో తమ కీలక ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని కేకేఆర్ యాజమాన్యం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తితో పాటు జట్టు వైస్-కెప్టెన్, కీలక ఫినిషర్ అయిన రింకూ సింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తన వర్క్‌లోడ్ కారణంగా ఐపీఎల్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడో లేదో స్పష్టత లేనందున, అతడిని కూడా ఈ ట్రేడింగ్‌లో చేర్చే అవకాశం కనిపించడం లేదు.
వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్, తరచూ గాయాల బారిన పడటం, అలాగే ప్రతీ వేదికకు అతనితో పాటు వచ్చే పెద్ద సిబ్బంది బృందంపై ఉన్న ఆందోళనల కారణంగా కేకేఆర్ యాజమాన్యం ప్రాథమిక చర్చల తర్వాత అంతగా ఆసక్తి చూపలేదని తెలిసింది. అయినప్పటికీ డీల్‌పై ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించగా, 2026 సీజన్‌లో ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసింది అంగ్‌క్రిష్ రఘువంశీనే. ఈ నేపథ్యంలో ఇంతటి కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి కేకేఆర్ సిద్ధంగా ఉందో లేదో ఇంకా స్పష్టత లేదు.
హార్దిక్ పాండ్యాను దక్కించుకునే రేసులో కేకేఆర్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్ నుంచి యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌లను ముంబై కోరగా, ఆ చర్చలు ముందుకు సాగలేదు. అదేవిధంగా చెన్నై నుంచి యువ బ్యాటర్ ఆయుష్ మ్హత్రేను అడగ్గా, సీఎస్‌కే ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
వచ్చే వారం ఈ ఫ్రాంచైజీల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ డీల్ భవిష్యత్తు మొత్తం అంగ్‌క్రిష్ రఘువంశీ విషయంలో కేకేఆర్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.