హైలో ఓపెన్‌లో భారత డబుల్ ధమాకా.. సింధు బాటలో లక్ష్య సేన్
Advertisement
- హైలో ఓపెన్ సూపర్ 500 టైటిల్ గెలుచుకున్న లక్ష్య సేన్
- ఫైనల్‌లో ఇండోనేషియా ఆటగాడు జొనాటన్ క్రిస్టీపై విజయం
- ఇదే టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ పీవీ సింధు కైవసం
- టోర్నీలో భారత్‌కు డబుల్ టైటిల్స్ సంబరం
Advertisement
భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ 'హైలో ఓపెన్ సూపర్ 500' బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఇండోనేషియా క్రీడాకారుడు జొనాటన్ క్రిస్టీపై 21-17, 21-10 తేడాతో ఆయన ఘన విజయం సాధించాడు. అంతకుముందు ఇదే టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకోవడంతో, భారత శిబిరంలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.
మ్యాచ్ ఆరంభం నుంచే లక్ష్య సేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లో శక్తిమంతమైన స్మాష్‌లు, కచ్చితత్వంతో కూడిన షాట్లతో కీలక పాయింట్లు రాబట్టి 21-17తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం ఆధిక్యం కనబరిచాడు. చివరలో క్రిస్టీ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో, 21-10తో లక్ష్య సేన్ సునాయాసంగా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
2022 కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన లక్ష్య సేన్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. క్రిస్టీతో గత రికార్డు అంత సానుకూలంగా లేనప్పటికీ, ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో అతడిపై సాధించిన విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో లక్ష్య సేన్ ఈ మ్యాచ్‌లో తలపడ్డాడు. కాగా, గతేడాది అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచి, హాంగ్ కాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడం విశేషం.