దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయిస్తోంది.. రాహుల్ గాంధీ ఆరోపణలు
Advertisement
- ఢిల్లీలో దుకాణాల మూసివేతపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
- రామ్‌లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ
- పండగల వేళ వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపార సంఘాల ఆందోళన
- ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని వ్యాపారుల విజ్ఞప్తి
Advertisement
ఢిల్లీలో వ్యాపారుల నష్టాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహిస్తున్న ర్యాలీతో వ్యాపారాలు దెబ్బతింటాయన్న బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయించిందని ఆరోపించారు. దీంతో వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నదెవరో ప్రజలు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. నేడు నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా ఆయన ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. పండగల సీజన్‌లో ఈ కార్యక్రమం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని ఢిల్లీ వ్యాపార సంఘాలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాయి. ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని కోరాయి.
ర్యాలీకి వచ్చే వారు ఢిల్లీలోని మార్కెట్లలో కొనుగోళ్లు చేయాలని తాము కోరామని రాహుల్ తెలిపారు. అయితే కనాట్ ప్లేస్‌కు వచ్చేసరికి అన్ని దుకాణాలనూ బీజేపీ బలవంతంగా మూసివేయించిందని ఆరోపించారు. వ్యాపారులకు నష్టం ఎలా జరుగుతోందో ప్రజలు గమనించాలని అన్నారు.
మరోవైపు, ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) వ్యాపారాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రామ్‌లీలా మైదానం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో సుమారు 3 లక్షల దుకాణాలు ఉండగా, వాటిలో 2.5 లక్షల వరకు మూతపడే అవకాశం ఉందని పేర్కొంది. ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల రాకపోకల్లో అంతరాయాల వల్ల పండగ వ్యాపారాలు దెబ్బతింటాయని తెలిపింది.