ఓట్ల తొలగింపు సరైనదే: 'సర్'కు అనుకూలంగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు
Advertisement
- కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపును సమర్థించిన మంత్రి సతీశ్
- మరణించిన, నకిలీ ఓటర్ల పేర్లనే తొలగించారని స్పష్టీకరణ
- ఓటర్ల జాబితా సవరణ అత్యంత పారదర్శకంగా జరిగిందని వెల్లడి
Advertisement
కర్ణాటక ఓటర్ల జాబితా నుంచి దాదాపు కోటి ఓట్లను తొలగించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి సతీశ్ జార్కిహోళి సమర్థించారు. ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారమే, అత్యంత పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓటు ఉన్న డూప్లికేట్ ఓటర్ల పేర్లను మాత్రమే తొలగించారని, ఇది సరైన నిర్ణయమేనని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)లో ఎలాంటి గందరగోళం, అక్రమాలు జరగలేదని ఆయన తెలిపారు. ఈ చర్యల వల్ల అర్హులైన ఏ ఒక్క ఓటరు హక్కుకు భంగం కలగలేదని, బోగస్ ఓట్లను ఏరివేయడానికే ఈ ప్రక్రియ దోహదపడిందని వివరించారు.
సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కర్ణాటకకు సంబంధించినది కాదని జార్కిహోళి స్పష్టం చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను అమలు చేసిన తీరుపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో మాత్రం సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం, ముందస్తు సమాచారం అందించడం వల్ల సవరణ ప్రక్రియ సక్రమంగా పూర్తయిందని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతే పద్ధతిగా, పారదర్శకంగా చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలనే విధానం మంచిదే అయినా, దాన్ని అమలు చేసే తీరు సరిగ్గా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు.