మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు? అశ్విన్‌ ఏమన్నాడంటే..!

Sports
Advertisement
  • మూడు టీ20ల్లో ఒక్క వికెట్టే తీసిన భువీ
  • అతడి బౌలింగ్‌ ఎకానమీ 11.58గా నమోదు
  • మూడో టీ20లో ఏకంగా 40 పరుగులు
  • భువీ స్థానంలో మయాంక్‌కు అవకాశం రావచ్చన్న అశ్విన్‌
  • భారత్‌ సిరీస్‌ గెలుచుకున్న నేపథ్యంలో మార్పులకు అవకాశం
Advertisement
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తున్నా.. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన అతడు.. మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. పరుగులు భారీగా సమర్పించుకున్నాడు. దీంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. భువీ స్థానంలో స్పిన్నర్‌ లేదా మయాంక్‌ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని పేర్కొన్నాడు. 

న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20ల్లో భువనేశ్వర్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. ఓవర్‌కు సగటున 11.58 పరుగులు ఇచ్చాడు. మూడో టీ20లో నాలుగు ఓవర్లు వేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ప్రదర్శనపై అశ్విన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భువీ స్థానంలో స్పిన్నర్‌ లేదా మయాంక్‌ యాదవ్‌ను ఆడించినా ఆశ్చర్యపోనని చెప్పాడు.

అయితే జట్టు ఎంపికలో మైదానాల పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్‌ సూచించాడు. తొలి రెండు మ్యాచ్‌లు పెద్ద మైదానాల్లో జరిగాయని, అక్కడ స్పిన్నర్లకు అవకాశం ఉండేదని చెప్పాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లు చిన్న మైదానాల్లో జరగనున్న నేపథ్యంలో స్పిన్నర్లను ఆడిస్తారా? లేదా? అన్నది చెప్పలేమన్నాడు. 

భారత్‌ తొలి టీ20లో మయాంక్‌ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో అతడు భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ కంటే మెరుగైన గణాంకాలు నమోదు చేశాడు. ఆ తర్వాత మయాంక్‌ స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు, స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తికి ఇప్పటివరకు అవకాశం దక్కలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. దీంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో జట్టు మార్పులు చేసే అవకాశం ఉంది.
Advertisement

సంబంధిత వార్తలు

Bhuvneshwar KumarRavichandran AshwinIndia vs New Zealand T20Mayank YadavIndian Cricket TeamKuldeep Yadav

More Telugu News

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు

29 Oct, 11:44

అర్నబ్ తుపాను ఎఫెక్ట్: సముద్రంలో చిక్కుకున్న భారీ కార్గో నౌక

29 Oct, 11:43

అలాంటి నిరసనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత.. యూపీ యోగి సర్కార్‌ నిర్ణయంపై ప్రతిపక్షాల ఫైర్‌

29 Oct, 11:35

ఏపీకి డబుల్ కష్టాలు.. సాధారణ స్థితి వచ్చేవరకు విశ్రమించొద్దు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

29 Oct, 11:32

ఆ పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టా: రెజీనా కసాండ్రా

29 Oct, 11:31

నా కుటుంబం పట్ల వివక్ష చూపారు.. విమానయాన సిబ్బంది ప్రవర్తన షాకింగ్‌గా అనిపించింది: సంగక్కర

29 Oct, 11:26

హైదరాబాద్ స్వీట్ షాపులపై దాడులు.. పుల్లారెడ్డి సహా పలు సంస్థలపై వేటు

29 Oct, 11:06

శ్రేయస్‌ అయ్యర్‌తో తన బంధంపై తిలక్‌ కామెంట్స్‌.. గంభీర్‌ సందేశం కూడా రివీల్‌!

29 Oct, 11:04

విద్యార్థుల కోసం ఉచిత ఏసీ ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్న ధనుష్

29 Oct, 10:55

బరువు తగ్గాలనుకుంటున్నారా? నడకతోనే కండరాలనూ పెంచుకోవచ్చా?

29 Oct, 10:51

అర్ధరాత్రి క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం.. ఆ రోజు మగాడిలా ఫీలయ్యాను: ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్ వైరల్

29 Oct, 10:48

భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమా.. ఐదు దేశాల జీడీపీ కంటే 'రామాయణ' బడ్జెట్ ఎక్కువ!

29 Oct, 10:46

స్టాక్ మార్కెట్లో జియో సంచలనం... ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద టెల్కోగా అవతరణ!

29 Oct, 10:30

102 ఉద్యోగాలకు టీజీపీఎస్‌సీ నుంచి కొత్త‌ నోటిఫికేషన్‌

29 Oct, 10:24
..More Telugu News