సంతకం చేయలేదు.. మెసేజ్ రాలేదు.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.35 కోట్లు గోల్‌మాల్!
Advertisement
- ఖాతాదారులకు లావాదేవీల సందేశాలు రాలేదని ఫిర్యాదు
- ఓ వ్యక్తి ఖాతాలో ఏకంగా రూ.39 లక్షలు మాయమైనట్లు ఆరోపణ
- మహిళ ఖాతాలో రూ.1.18 కోట్లు మాయమైనట్లు మరో ఆరోపణ
- శాఖ మేనేజర్ సహా పలువురు ఉద్యోగుల సస్పెన్షన్
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Advertisement
బ్యాంకులో డబ్బులు దాచుకుంటే భద్రంగా ఉంటాయని నమ్ముతాం. కానీ, తమ అనుమతి లేకుండానే ఖాతాల్లోని సొమ్ము మాయమైందని కొందరు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. కనీసం మెసేజ్ కూడా రాలేదని, డబ్బు బదిలీకి తాము ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయలేదని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) శాఖలో సుమారు రూ.35 కోట్ల మేర నిధులు మాయమైనట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాంచ్ మేనేజర్ సహా పలువురు బ్యాంకు ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు.
గ్రేటర్ నోయిడాలోని ఐచ్ఛర్ ప్రాంతంలో ఉన్న పీఎన్‌బీ శాఖలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొదుపు ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లలోని డబ్బు కూడా మాయమైనట్లు ఖాతాదారులు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండానే లావాదేవీలు జరిగాయని, వాటిపై బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఆరోపించారు.
ఒక ఖాతాదారుడి ఖాతాలో రూ.39 లక్షలు ఉండగా, ఇప్పుడు సొమ్ము కనిపించడం లేదని హనీఫ్ ఖాన్ తెలిపారు. లావాదేవీలకు తాను సంతకం చేయలేదని, ఎలాంటి మెసేజ్ రాలేదని చెప్పారు. మరో ఖాతాదారుడు జకీర్ తన ఖాతాలోని రూ.9.5 లక్షలు మాయమైనట్లు ఆరోపించారు. బ్యాంకుకు వెళ్లాకే విషయం తెలిసిందన్నారు.
విజేంద్ర సింగ్ అనే రైతు ఖాతాలో గతంలో రూ.87-88 లక్షలు ఉండేవి. ఇప్పుడు కేవలం రూ.లక్ష మాత్రమే కనిపిస్తోందని ఆయన చెప్పారు. భూసేకరణకు పరిహారంగా వచ్చిన సొమ్ములో ఎక్కువ భాగం మాయమైందని ఆరోపించారు. జేవర్ విమానాశ్రయం కోసం భూమి కోల్పోయిన సంతోష్ అనే 60 ఏళ్ల మహిళ ఖాతాలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె ఖాతాలో పరిహారంగా జమ చేసిన రూ.1.29 కోట్లలో రూ.1.18 కోట్లు కనిపించడం లేదని ఆరోపించారు.
ఖాతాదారుల ఫిర్యాదులతో బ్యాంకు శాఖ మేనేజర్ సహా పలువురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బు ఎలా బదిలీ అయింది? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఖాతాదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నిధులు మాయమైన తీరుపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.