ఇజ్రాయెల్ ఎన్నికలను అరబ్బులు దొంగిలించారు.. నెతన్యాహు సంచలన ఆరోపణలు
Advertisement
- ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఏ కూటమికీ దక్కని మెజారిటీ
- రికార్డు స్థాయిలో 19 సీట్లు గెలుచుకున్న అరబ్ పార్టీలు
- ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌మేకర్‌గా మారిన అరబ్ పక్షాలు
- ఓట్ల కొనుగోలు ఆరోపణలపై ముగ్గురి అరెస్ట్, విచారణ
Advertisement
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఏ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అరబ్ నేతృత్వంలోని పార్టీలు లంచాలు, బెదిరింపులు, హింసకు పాల్పడి ఎన్నికలను దొంగిలించాయని తీవ్రంగా విమర్శించింది.
బుధవారం నాటికి దాదాపు 90 శాతం ఓట్లు లెక్కించగా, 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ 'నెస్సెట్'లో నెతన్యాహు నేతృత్వంలోని మితవాద కూటమి 53 సీట్లకు పరిమితమైనట్లు తెలుస్తోంది. మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని విపక్ష కూటమి 48 స్థానాల్లో నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం కాగా, రెండు కూటములూ ఆ మార్కును అందుకోలేకపోయాయి.
కింగ్‌మేకర్‌గా అరబ్ పార్టీలు
ఈ ఎన్నికల్లో అరబ్ నేతృత్వంలోని జాయింట్ లిస్ట్, రామ్ పార్టీలు చారిత్రక విజయాన్ని నమోదు చేశాయి. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థానాలు సాధించి, ఏకంగా 19 సీట్లను కైవసం చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీలు కింగ్‌మేకర్‌గా అవతరించాయి. ఈ పరిణామంతోనే నెతన్యాహు వర్గం తీవ్ర ఆందోళనతో ఆరోపణలకు దిగింది. ఓటింగ్ శాతం కూడా గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 77 శాతానికి చేరడం గమనార్హం.
"ఉగ్రవాదానికి, యూదు దేశ వినాశనానికి మద్దతిచ్చే అరబ్ పార్టీలు ఈ ఎన్నికలను దొంగిలించాయి" అని లికుడ్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఓటర్లను ప్రలోభపెట్టడం, పోలింగ్ అధికారులను బెదిరించడం, నకిలీ ఓట్లు వేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. దీనికి సంబంధించి వందలాది సాక్ష్యాలు, ఆధారాలను పోలీసులకు, సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీకి సమర్పించినట్లు వెల్లడించింది.
ఇప్పటికే రామ్ పార్టీకి ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. వారి నుంచి నగదు, కవర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇది ఒకటీ అరా చోట్ల జరిగిన అసాధారణ ఘటన అని, దీనిపై విచారణ జరుగుతోందని ఎన్నికల కమిటీ తెలిపింది. పూర్తిస్థాయి అక్రమాల ఆరోపణలను కూడా సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతానికి ఇరు కూటముల నేతలూ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా సంప్రదింపుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పార్టీలకు పిలుపునిచ్చారు. తుది ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.