‘జ్ఞానేశ్ కుమార్ దిగిపోవాలి’.. ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు!
Advertisement
- నవంబర్ 1న ఢిల్లీలో ఆందోళన
- జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
- అర్హుల ఓటు హక్కును కాపాడాలని విజ్ఞప్తి
- అంబేడ్కర్ సమాన ఓటు హక్కును ప్రస్తావించిన పార్టీ
- స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పోరాడుతామని ప్రకటన
Advertisement
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టనున్న ఆందోళనకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) మద్దతు ప్రకటించింది. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీకి అండగా నిలుస్తామని వెల్లడించింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించింది. అయితే, తమ నేతలు కూడా ఇండియా కూటమి నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొంటారా, లేదా అనే అంశంపై సీజేపీ స్పష్టత ఇవ్వలేదు.
ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవాలి కానీ, ఎవరెవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయించకూడదని సీజేపీ తన ప్రకటనలో పేర్కొంది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపింది. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం తిరిగి కలగాలంటే జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కూడా సీజేపీ తన ప్రకటనలో ప్రస్తావించింది. కులం, మతం, లింగం, విద్య, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి వయోజనుడికి సమాన ఓటు హక్కు కల్పించడమే ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొంది. పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయాలి తప్ప, వారి హక్కులకు అడ్డంకులు సృష్టించకూడదని అభిప్రాయపడింది. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పోరాడే సంస్థలకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది.
జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నవంబర్ 1న భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓటరు జాబితాల సవరణ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలే ఈ ఆందోళనకు ప్రధాన కారణాలు. అయితే ఎస్‌ఐఆర్ ద్వారా అనర్హుల పేర్లను తొలగించడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతుండగా.. అర్హులైన ఓటర్లు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.