‘ప్రతిచోటా దెయ్యాలే కనిపిస్తున్నాయా?’.. రాహుల్‌కు నిర్మల ఘాటు కౌంటర్
Advertisement
- టాటా వ్యవహారంపై రాహుల్ గాంధీ ఆరోపణలు
- రాహుల్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్
- ప్రతిచోటా దెయ్యాలను వెతకొద్దంటూ చురకలు
- వ్యాపార అంశాలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు
- కాంగ్రెస్ లైసెన్స్-కోటా విధానంపై విమర్శలు
Advertisement
టాటా గ్రూప్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలో చూడొద్దని, వాణిజ్య, న్యాయపరమైన విషయాలను నేరాలుగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. ‘ప్రతిచోటా దెయ్యాలను వెతకడం మానుకోండి’ అంటూ ఎక్స్ వేదికగా చురకలంటించారు.
టాటా గ్రూప్ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఆ సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై వ్యాపార ప్రముఖులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. తమ దాకా వస్తే గానీ తెలియదా? అంటూ విమర్శించారు. భారత వ్యాపార రంగం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల్లోని ఆటబొమ్మ కాదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మలా సీతారామన్.. భారత పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల విజయాలను కాంగ్రెస్ పదేపదే తక్కువ చేసి చూపుతోందని విమర్శించారు. వ్యాపార రంగంలో అవిశ్వాసం, విషపూరిత వాతావరణం వ్యాప్తి చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పాలనలోని లైసెన్స్-కోటా విధానం పారిశ్రామికవేత్తల స్వేచ్ఛను దెబ్బతీసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.
టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు కొనసాగించాలన్న నిర్ణయంపై వివాదం నెలకొంది. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సవాల్ చేశారు. ఆ నిర్ణయం చెల్లదని, నిబంధనల ప్రకారం జరగలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.