పులివెందుల ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ సవాళ్లు: మంత్రి సత్యకుమార్

Andhra
Advertisement
  • ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ హింసను రెచ్చగొడుతున్నారన్న సత్యకుమార్
  • నామినేషన్లప్పుడు కనిపించకుండా, ఇప్పుడు సవాళ్లు విసురుతున్నారని విమర్శ
  • ప్రజాస్వామ్యవాదిగా మారాలని జగన్‌కు హితవు
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున పులివెందులలోనే ఉంటా, ఎవరోస్తారో రండి చూస్తానంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి పార్టీ ఎదుర్కొన్న పరాభవాన్ని జీర్ణించుకోలేక, పోలింగ్ నాడు హింసను రెచ్చగొట్టడానికే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

"నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి కడపలో సీన్ రివర్స్ అయి తాను, తన పార్టీ 'పడక' ఎక్కడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పోలింగ్ నాడు హింసను రెచ్చగొట్టే దురుద్దేశం ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది" అని విమర్శించారు. దశాబ్దాలుగా తన కుటుంబం అనుసరించిన హింసా రాజకీయాలనే జగన్ కొనసాగించాలనుకుంటున్నారని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

"నామినేషన్ల సమయంలో ప్యాలెస్‌కు పరిమితమై, విత్ డ్రాయల్స్ సమయంలో ముఖం చాటేసి, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చొక్కా మడతపెట్టడంలో ఆంతర్యం ఏమిటి?" అని సత్యకుమార్ నిలదీశారు. ఎన్నికలను వాయిదా వేయించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ తనను తాను సంస్కరించుకుని, ప్రజాస్వామ్యవాదిగా మారే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.
Advertisement

సంబంధిత వార్తలు

Satya Kumar YadavJagan Mohan ReddyPulivendula electionsAndhra Pradesh local body pollsYSRCP Pulivendula defeatKadapa election politics

More Telugu News

ఏఐ సాయంతో కల్తీ మద్యం తయారీ.. మధ్యప్రదేశ్‌లో 13 మంది మృతి!

28 Oct, 21:41

రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ బంద్.. భద్రతపై రైల్వే బోర్డు కీలక ఆదేశాలు

28 Oct, 21:34

చదవడానికి కూర్చుంటే ఫోన్‌ చూస్తున్నారా? ఈ చిట్కాలతో ఏకాగ్రత పెంచుకోండి!

28 Oct, 21:14

పైన బుల్లెట్ ట్రైన్.. కింద సాధారణ రైళ్లు.. అహ్మదాబాద్‌లో రైల్వే అద్భుతం!

28 Oct, 21:07

‘జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాలి’.. ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ మద్దతు!

28 Oct, 21:01

ఆ సమయంలో అతడి సినిమాలే నాకు ఉపశమనం: రోహిత్ శర్మ

28 Oct, 20:32

‘ప్రతిచోటా దెయ్యాలే కనిపిస్తున్నాయా?’.. రాహుల్‌కు నిర్మల ఘాటు కౌంటర్‌

28 Oct, 20:32

తుపాను బాధితులకు భారీ ప్యాకేజి ప్రకటించిన చంద్రబాబు.. ఎవరికి ఎంత.. పూర్తి వివరాలు ఇవిగో!

28 Oct, 20:14

ఇంట్లోనే సినిమా హాలు.. ఎల్‌జీ కొత్త టీవీ ధర, ఫీచర్లు ఇవే!

28 Oct, 20:13

‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయిపల్లవి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ!

28 Oct, 19:49

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

28 Oct, 19:43

తుపాను వేళ ఏపీకి అండగా తెలంగాణ ప్రభుత్వం.. సాయానికి సిద్ధమన్న భట్టి

28 Oct, 19:39

అమ్మాయిలు అదరహో.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

28 Oct, 19:33

రూ.1,500తో ఏడాది టోల్‌ ప్రయాణాలు.. ఎవరికి వర్తిస్తుందంటే?

28 Oct, 19:28
..More Telugu News