ధరల భారం నుంచి ఊరట.. ఇక బియ్యంతో పాటు నిత్యావసరాలు!
Advertisement
- ధరల పెరుగుదల, కరవు భయాలు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
- రేషన్‌పై నిత్యావసరాల పంపిణీకి యోచన
- కందిపప్పు, గోధుమపిండి, నూనె, చక్కెర వంటివి ఇచ్చేందుకు కసరత్తు
- ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
- సాధ్యాసాధ్యాలను పరిశీలించి సంక్రాంతి నాటికి అమలు చేసే అవకాశం
Advertisement
తెలంగాణలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఎల్ నినో ప్రభావంతో కరవు పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులపై పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పాటు కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి మరిన్ని సరుకులను అందించే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల అవసరాలు, సరుకుల సేకరణకు ఏర్పాట్లు, ఎంత పరిమాణంలో ఇవ్వాలి? ఎంతకాలం కొనసాగించాలి? బడ్జెట్‌పై పడే భారం వంటి అంశాలను అంచనా వేయాలని సూచించారు. ఆర్థిక, లాజిస్టిక్స్ పరమైన అంశాలు కొలిక్కి వస్తే, వచ్చే సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులపై సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలకు తలసరి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నారు. ఇందుకు నెలకు 2.18 లక్షల టన్నుల బియ్యం అవసరం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 14 నెలలకు సరిపడా ఆహార ధాన్యాల బఫర్ స్టాక్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం గోదాముల్లో 9.64 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉండగా, కస్టమ్ మిల్లింగ్ రైస్, ఇతర మార్గాల ద్వారా మరో 18.39 లక్షల టన్నులు సమకూరనున్నాయి. ఈ నిల్వలు 2027 సెప్టెంబర్ వరకు సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో రేషన్ షాపుల ద్వారా పలు రకాల నిత్యావసరాలను అందించేవారు. 2023లో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో పంపిణీని విస్తరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదల నుంచి ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఏయే సరుకులు ఎంత పరిమాణంలో ఇవ్వాలనే దానిపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది.