జగన్ ఉడత బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు: మంత్రి అచ్చెన్నాయుడు

Andhra
Advertisement
  • జగన్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
  • 'మా టైం వస్తుంది' అనడానికి ఇది జమీందారీ రాజ్యం కాదని చురక
  • గత ఐదేళ్ల పాలనలోని హింసాత్మక ఘటనలను గుర్తు చేసిన అచ్చెన్నాయుడు
  • సొంత కుటుంబ సభ్యులపైనే జగన్ కక్ష సాధిస్తున్నారని తీవ్ర ఆరోపణ
  • సోషల్ మీడియా వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పించిన వ్యవసాయ మంత్రి
Advertisement
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఉడత బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడేవారెవరూ ఇక్కడ లేరని, ఇది ప్రజాస్వామ్యం తప్ప జమీందారీ రాజ్యం కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

"వడ్డీతో సహా చెల్లిస్తాం", "ఇప్పుడు మీ టైం.. తర్వాత మా టైం" వంటి హెచ్చరికలను మానుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ఇచ్చేది ప్రజలేనని గుర్తుంచుకోవాలన్నారు. గత ఐదేళ్ల దారుణ పాలనపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, అధికారులను, పోలీసులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి అభ్యర్థి పూర్తి స్వేచ్ఛతో నామినేషన్ వేస్తున్నారని, తమ పాలనకు, గత పాలనకు ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు.

గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిపై వైసీపీ నేతలు దాడి చేసినా, పుంగనూరులో మిథున్‌రెడ్డి హింస సృష్టించినా జగన్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు. మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడులను, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించేందుకు తెచ్చిన నల్ల ఆర్డినెన్స్‌ను ప్రజలు మర్చిపోలేదన్నారు.

జగన్ తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని, ఎన్ని పాదయాత్రలు చేసినా, పొర్లుదండాలు పెట్టినా ప్రజలు ఇక నమ్మరని విమర్శించారు. "సొంత చెల్లి, మేనకోడలిపైనే కక్ష సాధించే సైకో, దుర్మార్గుడు రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తాడు? తండ్రిలాంటి మేనమామ స్థానంలో ఉండి, సొంత మేనకోడలి వివాహానికే అడ్డంకులు సృష్టిస్తున్నావంటే నీ రాక్షసత్వం అర్థమవుతోంది" అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
Advertisement

సంబంధిత వార్తలు

AtchannaiduYS Jagan Mohan ReddyAndhra Pradesh PoliticsTDP Alliance GovernmentYSRCP CriticismKinjarapu Atchannaidu

More Telugu News

సామాన్యులకు చంద్రబాబు సర్కారు భారీ ఊరట.. తక్కువ ధరకే నిత్యావసరాలు

27 Oct, 21:35

తింటే చాలు.. కళ్లముందు బుల్లి మనుషుల ప్రపంచం.. వెలుగులోకి వింత పుట్టగొడుగు!

27 Oct, 21:27

తుపాను ఒక్కోసారి దిశ మార్చుకుంటుంది.. అందుకే ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

27 Oct, 21:06

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులకు నోటిఫికేషన్

27 Oct, 20:49

'ఎస్ఐఆర్'పై కాంగ్రెస్ వైఖరిని నిలదీసిన సీఎం చంద్రబాబు

27 Oct, 20:07

సందీప్ కిషన్ 'పవర్ పేట'.. 'పడమటి వీధి జానకి'గా రితికా నాయక్.. ఓ రేంజిలో గ్లామర్!

27 Oct, 20:07

పులివెందులలో టీడీపీ కూటమి ప్రభంజనం.. 20 వార్డుల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవం!

27 Oct, 19:58

ఇలాంటి బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదన్న అయ్యర్.. వాళ్లను ఆపడం కష్టమన్న శాంట్నర్

27 Oct, 19:28

ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

27 Oct, 19:27

లిటిగేషన్లే ఆ పార్టీ రాజకీయం.. మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించండి: సీఎం చంద్రబాబు

27 Oct, 18:54

మీరు 2.0 అంటే... మేం 10X చూపిస్తాం: జగన్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్

27 Oct, 18:53

రజనీకాంత్ ‘జైలర్ 2’.. హృతిక్ రోషన్ ‘రోడీ థీమ్’ విడుదల

27 Oct, 18:26

నామినేషన్లు వేయడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది: వైఎస్ అవినాశ్ రెడ్డి

27 Oct, 18:14

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

27 Oct, 18:08
..More Telugu News