సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

Sports
Advertisement
  • న్యూజిలాండ్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ
  • అంటూ శిష్యుడిని ప్రశంసించిన గురువు యువరాజ్ సింగ్
  • ఇలాంటి సెంచరీ నేను చేయలేనంటూ యువరాజ్ కితాబు
  • తన 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డును గుర్తు చేస్తూ సరదా వ్యాఖ్యలు
  • యువరాజ్ ఫీట్ సాధించడం సులభం కాదన్న అభిషేక్ శర్మ
Advertisement
తన శిష్యుడు అభిషేక్ శర్మ న్యూజిలాండ్‌పై రికార్డు శతకంతో చెలరేగిన వేళ, భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించాడు. ఒకవైపు తన రికార్డును గుర్తుచేస్తూ సరదాగా ఆటపట్టిస్తూనే, మరోవైపు శిష్యుడి అద్భుత ప్రదర్శనను మనసారా ప్రశంసించాడు. ఈ గురుశిష్యుల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 45)తో కలిసి జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం అభిషేక్ తనదైన శైలిలో 'మెడిటేషన్'తో సెలబ్రేట్ చేసుకున్నాడు.

అభిషేక్ ఇన్నింగ్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన యువరాజ్ సింగ్, తొలుత సరదాగా టీజ్ చేశాడు. "నువ్వు 12 బంతుల్లో 50 పరుగులు ఇంకా చేయలేదు!" అంటూ 2007 టీ20 ప్రపంచకప్‌లో తన రికార్డును గుర్తు చేశాడు. అందుకు అభిషేక్ శర్మ స్పందిస్తూ... "అలాంటి ఫీట్లు (12 బంతుల్లో 50) చేయడం అంత సులభం కాదు.. ఇలాంటివి ఎప్పుడో కానీ సాధ్యం కావు... అన్ని వేళలా అలా ఆడాలంటే కష్టం" అని వినమ్రంగా చెప్పాడు. 

అయితే, వెంటనే మరో ట్వీట్‌లో యువీ తన శిష్యుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. "నేను 30-34 బంతుల్లో 100 పరుగులు చేయలేను. సార్, మీరు అద్భుతంగా ఆడారు! గొప్ప ఇన్నింగ్స్. సెంచరీ సాధించే క్రమంలో తమరు సింగిల్స్ కూడా తీశారు" అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, యువీ ఇతర ఆటగాళ్లపైనా తన స్పందన తెలియజేశాడు. మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ కూడా అదరగొట్టాడని కొనియాడాడు. సంజూ శాంసన్ జట్టు కోసం మూడో స్థానంలో ఆడటం గొప్ప విషయం అని అభినందించాడు. "200 లోపు స్కోరుకు ప్రత్యర్థిని కట్టడి చేసిన మన బౌలర్లకు అభినందనలు. అద్భుత సిరీస్ విజయం" అంటూ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

Advertisement

సంబంధిత వార్తలు

Abhishek SharmaYuvraj SinghIndia vs New Zealand T20Abhishek Sharma CenturyFastest T20 CenturyTeam India Victory

More Telugu News

రజనీకాంత్ ‘జైలర్ 2’.. హృతిక్ రోషన్ ‘రోడీ థీమ్’ విడుదల

27 Oct, 18:26

నామినేషన్లు వేయడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది: వైఎస్ అవినాశ్ రెడ్డి

27 Oct, 18:14

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

27 Oct, 18:08

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా.. భయపడొద్దు.. తిరగబడండి: జగన్

27 Oct, 18:04

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

మొదలైన తుపాను ప్రభావం.. విశాఖలో విరిగిపడుతున్న చెట్లు, ఉత్తరాంధ్రలో హై అలర్ట్

27 Oct, 17:34

కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

27 Oct, 17:15

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23

దుబాయ్ ఐఫోన్ కోసం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నిరసన.. అసలేం జరిగింది?

27 Oct, 16:13

కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

27 Oct, 15:55
..More Telugu News