తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

Telangana
Advertisement
  • ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరవు నెలకొందన్న బాల్క సుమన్
  • నీళ్లు, కరెంట్ లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
  • సమస్యలు పరిష్కరించకుండా హరీశ్, కేటీఆర్‌లపై విమర్శలెందుకని ప్రశ్న
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వమే సృష్టించిన కరవు అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతులు నీళ్లు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని సుమన్ మండిపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలను ఓ పెద్ద డ్రామాగా అభివర్ణించారు. ఉన్న నీటిని ముందుగానే వదిలేసి, ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికే అని అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు పూర్తి వివరాలతో నిన్ననే వివరించారని గుర్తు చేశారు. సమస్యపై స్పందించకుండా మంత్రులు కేవలం హరీశ్ రావు, కేటీఆర్‌లను దూషించడం సరికాదని హితవు పలికారు.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్టులను ఆన్ చేసి ఉంటే సంబంధిత జిల్లాలకు నీరందేదని సుమన్ అభిప్రాయపడ్డారు. నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం గతంలోనే స్పష్టం చేసినప్పుడు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రైతుల సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్, ఎంత ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుంది, అయ్యే ఖర్చు వివరాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్, కె. కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Balka SumanTummadihatti ProjectRevanth ReddyTelangana DroughtBRS PartyTelangana Congress Government

More Telugu News

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా.. భయపడొద్దు.. తిరగబడండి: జగన్

27 Oct, 18:04

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

మొదలైన తుపాను ప్రభావం.. విశాఖలో విరిగిపడుతున్న చెట్లు, ఉత్తరాంధ్రలో హై అలర్ట్

27 Oct, 17:34

సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

27 Oct, 17:16

కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

27 Oct, 17:15

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23

దుబాయ్ ఐఫోన్ కోసం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నిరసన.. అసలేం జరిగింది?

27 Oct, 16:13

కాకినాడకు 167 కి.మీ. దూరంలో 'అర్ణబ్.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

27 Oct, 15:55

కొత్తగా రూ.1,000 నోటు వస్తోందా? వైరల్‌ వార్తలపై కేంద్రం కీలక ప్రకటన

27 Oct, 15:50

భారత్‌లో అతిపెద్ద జిల్లా ఇదే.. కొన్ని రాష్ట్రాలు, దేశాల కన్నా పెద్దది!

27 Oct, 15:48

వెల్లింగ్టన్‌లో అభిషేక్ సునామీ.. రికార్డుల మోతతో సిరీస్ భారత్ కైవసం

27 Oct, 15:45
..More Telugu News